టీ20 ప్రపంచ కప్-2022: నవంబర్ 10న సెమీఫైనల్స్ లో తలపడనున్న భారత్, ఇంగ్లాండ్ జట్లు

T20 World Cup-2022: India Vs England Semi Finals at Adelaide Oval on 10th November, T20 World Cup-2022, India Vs England Semi Finals,Semi Finals at Adelaide Oval on 10th November, Mango News,Mango News Telugu,India T20 worldcup, Viart Kohli, Rizwan,Indian Team Captian,Pakistan Team Captain, Rohit Sharma,Indian Cricket Team,England Cricket Captain,England Cricket Team,ENG Vs IND, India Vs England, Ind Vs Eng Match

టీ20 ప్రపంచ కప్-2022 లో గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు, గ్రూప్‌-2 భారత్‌, పాకిస్థాన్‌ జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటి సెమీఫైనల్లో న్యూజిలాండ్, పాకిస్తాన్, రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. సూపర్-12 రౌండ్లో గ్రూప్-1లో మొదటి స్థానంలో ఉన్న న్యూజిలాండ్, గ్రూప్‌-2 లో రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్‌ జట్ల మధ్య సిడ్నీ గ్రౌండ్ లో నవంబర్ 9, బుధవారం మధ్యాహ్నం 1.30 గంటకు మొదటి సెమీఫైనల్ జరగనుంది.

అలాగే సూపర్-12 రౌండ్లో గ్రూప్-2లో మొదటి స్థానంలో ఉన్న భారత్, గ్రూప్‌-1 లో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్ల మధ్య అడిలైడ్ ఓవల్ గ్రౌండ్ లో నవంబర్ 10, గురువారం మధ్యాహ్నం 1.30 గంటకు రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇక ఈ సెమీఫైనల్లో గెలిచిన జట్లు నవంబర్ 13, ఆదివారం మధ్యాహ్నం 1.30 గంట నుంచి టీ20 ప్రపంచ కప్-2022 టైటిల్ కోసం ఫైనల్లో తలపడనున్నాయి. సూపర్-12 రౌండ్ లో పలు మ్యాచ్ లు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతూ సంచలనాలు నమోదై, క్రీడాభిమానులు విశేషంగా అలరించిన విషయం తెలిసిందే. కాగా నాలుగు జట్లు కూడా ఎంతో ప్రభావంతమైనవి కావడంతో సెమీఫైనల్స్, ఫైనల్ కూడా అదే తరహాలో సాగుతాయని అభిమానులు, క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంగ్లాండ్ తో కీలక సెమీఫైనల్ మ్యాచ్ లో పక్కా ప్రణాళికతో రాణించి, ఫైనల్ కు చేరుకోవాలని రోహిత్ సేన భావిస్తుంది.

గ్రూప్ స్టేజిలో మొత్తం 5 మ్యాచుల్లో అద్భుతంగా రాణించి, నాలుగు విజయాలు, ఒక ఓటమితో 8 పాయింట్లు, +0.1319 నెట్‌ రన్‌రేట్ సాధించిన భారత్ మొదటి స్థానంలో నిలిచి సెమీఫైనల్స్ కు చేరుకుంది. కాగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించడం ఇది 4వసారి. బౌలర్లు భువనేశ్వర్, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, అశ్విన్ మెరుగైన ప్రదర్శన చేస్తుండడం, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్ లో ఉండడం, ఓపెనర్ కేఎల్ చివరి రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసి ఫామ్ అందుకోవడం భారత్ జట్టుకు కలిసొచ్చే అంశం కానుంది. అయితే స్టార్ బ్యాటర్, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ కూడా అంచనాలకు అనుగుణంగా రాణిస్తే భారత్ టీ20 ప్రపంచ కప్-2022 ఫైనల్ కు దూసుకెళ్లే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 1 =