పంజాబ్: కాంగ్రెస్ నేత, ప్రముఖ గాయకుడు సిద్ధూ మూస్ వాలా దారుణ హత్య, జీపులో వెళ్తుండగా దుండగుల కాల్పులు

Punjab Congress Leader and Famous Singer Sidhu Moose Wala Lost Life in Gun Shot, Famous Singer Sidhu Moose Wala Lost Life in Gun Shot, Singer Sidhu Moose Wala Lost Life in Gun Shot, Punjab Congress Leader Sidhu Moose Wala Lost Life in Gun Shot, Congress Leader Sidhu Moose Wala Lost Life in Gun Shot, Sidhu Moose Wala Lost Life in Gun Shot, Gun Shot, Punjab Congress Leader, Famous Singer, Sidhu Moose Wala, Famous Singer Sidhu Moose Wala, Singer Sidhu Moose Wala, Punjab Congress Leader Sidhu Moose Wala, Sidhu Moose Wala News, Sidhu Moose Wala Latest News, Sidhu Moose Wala Latest Updates, Sidhu Moose Wala Live Updates, Mango News, Mango News Telugu,

పంజాబ్‌లో ఘోరం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ నేత, ప్రముఖ పంజాబీ గాయకుడు ‘సిద్ధూ మూస్ వాలా’ దారుణ హత్యకు గురయ్యారు. మాన్సా జిల్లాలోని జవహర్ కే గ్రామంలోని ఒక దేవాలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిద్ధూ జీపులో వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయనను కాల్చి చంపారు. ఆయనపై 20 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సిద్ధూతో పాటు మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయ. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సిద్ధూని హుటాహుటిన అస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారని వైద్యులు ప్రకటించారు.

కాగా సిద్ధూ మూస్ వాలా హత్యపై కాంగ్రెస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ విషాదవార్త కాంగ్రెస్ పార్టీకి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అతని కుటుంబానికి, అభిమానులకు మరియు స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి అని జాతీయ కాంగ్రెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. “కాంగ్రెస్‌ నాయకుడు, ప్రతిభావంతుడైన కళాకారుడు సిద్ధూ మూసేవాలా హత్యతో తీవ్ర దిగ్భ్రాంతి మరియు బాధ కలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ఆత్మీయులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

కాగా పంజాబ్‌లో వీఐపీలకు భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన ఒక్కరోజులోనే ఈ ఘటన కలకలం రేపుతోంది. పంజాబ్ పోలీసులు శనివారం భద్రతను ఉపసంహరించుకున్న 424 మందిలో సిద్ధూ మూస్ వాలా కూడా ఉన్నారు. సిద్దూ గత ఏడాది డిసెంబర్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాన్సా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసిన ఆయన ఆప్‌కి చెందిన విజయ్ సింగ్లా చేతిలో ఓడిపోయారు. అయితే పంజాబ్‌లో ‘ఆప్’ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయని, పట్టపగలే హత్యలు, పాటియాలలో హింసాత్మక ఘర్షణలు, ఇంకా పంజాబ్ పోలీసులపై దాడులే దీనికి ఉదాహరణ అని కాంగ్రెస్ విమర్శించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + nineteen =