మన పెద్దల మౌన వ్రతం వెనుక ఇన్ని కారణాలున్నాయా?

Silence for one hour every day how many benefits,Silence for one hour every day, how many benefits,one hour every day,Mango News,Mango News Telugu,being silent, every day, many benefits, many reasons of silence, Silence, Silence for one hour,Silence connect with your emotions,Are There Health Benefits to Silence,Is there any science, Benefits of Silence,Hidden Benefits of Silence,Surprising Benefits of Silence,The Power of Silence,Silence benefits News Today
Silence for one hour, every day, many benefits , many reasons of silence, Silence,being silent

మాట.. నిజంగా ఓ మంత్రమే. మాట్లాడడం ఒక అందమైన కళ. ఒక మనిషి విలువ తను మాట్లాడే విధానంలోనే తెలుస్తుంది. కొందరు ఆ మాటలతోనే ఎదుటవాళ్లను అమాంతం బుట్టలో వేసి తమ పనిని కానిచ్చుకుంటారు. మాటకు అంత విలువ ఉంటుంది కాబట్టే బాగా మాట్లాడేవారికి ఎక్కువ మంది స్నేహితులు కూడా ఉంటారు.

అయితే మాటలు ఎంత మంత్రమే అయినా.. మౌనంగా ఉండటం మరింత మేలు చేస్తుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతి ఒక్కరు రోజులో కనీసం ఒక గంటసేపు అయినా మౌనంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. అయితే రోజులో ఏ టైములో అయినా మౌనంగా ఉండొచ్చా లేక దీనికి కూడా ప్రత్యేకంగా ఒక టైమ్ ఉంటుందా అని చాలామందికి అనుమానం వస్తుంటుంది.

నిజానికి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత.. కాసేపు మౌనంగా ఉండడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా ప్రతి రోజు ఒక గంటసేపు మౌనంగా ఉంటే.. మానసిక ఒత్తిడి నుంచి బయట పడతారని చెబుతున్నారు. ఎందుకంటే మౌనం మన ఆందోళనను, ఒత్తిడిని కంట్రోల్ చేస్తుందట. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకుల పరుగుల జీవితంలోనే ప్రతి ఒక్కరి జీవితం గడిచిపోతుంది.

బిజీబిజీ లైఫ్‌లో రిలాక్సేషన్ కోసం అయినా కచ్చితంగా ఒక గంట సేపు మౌనంగా ఉంటే ఆ అలసట తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మౌనంగా ఉన్న వారిలో వారి మెదడు పని తీరు చురుగ్గా మారుతుందని అంటున్నారు. మౌనం వల్ల ఆవేశం, కోపం, చిన్నచిన్న వాటికి గొడవలు పడడం, అనవసరంగా నోరు పారేసుకోవడం వంటి లక్షణాలు తగ్గుతాయట. అలాగే గుండె దడ తగ్గించడంలోనూ మౌనం మెడిసిన్‌లా పనిచేస్తుందట. అప్పట్లో మన పెద్దవాళ్లు వారానికి ఒకరోజు అయినా మౌనవ్రతం ఉండటం వెనుక ఈ కారణాలే ఉన్నాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =