టీ20 ప్రపంచ కప్-2022: గ్రూప్-1 నుంచి సెమీస్ కు చేరిన రెండో జట్టుగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకు షాక్

T20 World Cup-2022: England beats Sri Lanka by 4 Wickets, Joined New Zealand as the 2nd Semi Finalist From Group-1, T20 World Cup-2022, England beats Sri Lanka by 4 Wickets, New Zealand 2nd Semi Finalist From Group-1,Mango News,Mango News Telugu,ndia Qualified T-20 Worldcup Semi Finals,Pakistan Qualified T-20 Worldcup Semi Finals,T20 World Cup 2022,Mango News,Mango News Telugu,T20 Worldcup Latest News And Updates,T20 World Cup News And Live Updates, Pakistan T20 Worldcup,India T20 worldcup, Viart Kohli, Rizwan,Indian Team Captian,Pakistan Team Captain, Rohit Sharma,Indian Cricket Team

టీ20 ప్రపంచ కప్-2022 లో గ్రూప్-1 కు సంబంధించి సూపర్-12 రౌండ్ మ్యాచ్ లు ముగియడంతో సెమీఫైనల్ బెర్తులు ఖరారు అయ్యాయి. గ్రూప్-1 నుంచి అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించగా, తాజాగా గ్రూప్-1 నుంచి సెమీస్ కు చేరిన రెండో జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. శనివారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో శ్రీలంక పై జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. శ్రీలంకపై ఇంగ్లాండ్ గెలుపుతో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాకు షాక్ తగిలి, టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.

గ్రూప్-1లో సూపర్-12 రౌండ్ పూర్తయ్యేసరికి న్యూజిలాండ్ (7 పాయింట్లు, +2.113 నెట్‌ రన్‌రేట్), ఇంగ్లాండ్ (7 పాయింట్లు, +0.473 నెట్‌ రన్‌రేట్), ఆస్ట్రేలియా (7 పాయింట్లు, -0.173 నెట్‌ రన్‌రేట్) జట్లు సమాన పాయింట్లతో మొదటి మూడు స్థానాల్లో నిలిచినప్పటికీ మెరుగైన నెట్ రన్‌రేట్ ఆధారంగా న్యూజిలాండ్ తర్వాత ఇంగ్లాండ్ జట్టు సెమీస్ కు చేరుకుంది. దీంతో ఆస్ట్రేలియా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్-2022లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. అయితే ఇప్పటివరకు T20 ప్రపంచకప్‌ టైటిల్ ను ఆతిథ్య దేశాలు ఎప్పుడూ గెలుచుకోలేకపోవడం గమనార్హం. అలాగే గ్రూప్-1 లో ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక, ఐర్లాండ్ జట్లు కూడా ఇంటిముఖం పట్టాయి.

ఇంగ్లాండ్ సెమీస్ కు చేరిన విధానం(సూపర్-12 – గ్రూప్-1 – 7 పాయింట్స్ – +0.473 నెట్‌ రన్‌రేట్):

  • అక్టోబర్ 22 – ఆఫ్ఘనిస్థాన్ పై 5 వికెట్ల తేడాతో విజయం
  • అక్టోబర్ 26 – ఐర్లాండ్ పై 5 పరుగులతో పరాజయం(డీఎల్ఎస్ మెథడ్)
  • అక్టోబర్ 28 – ఆస్ట్రేలియా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
  • నవంబర్ 1 – న్యూజిలాండ్ పై 20 పరుగులతో విజయం
  • నవంబర్ 5 – శ్రీలంకపై 4 వికెట్ల తేడాతో విజయం.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =