ఏపీలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ రద్దు, హైకోర్టు కీలక ఆదేశాలు

Andhra Pradesh Government, Andhra Pradesh panchayat elections, AP Gram Panchayat Elections, AP Gram Panchayat Elections News, AP High Court, AP High Court Suspends Panchayat Election, AP High Court Suspends Panchayat Election Schedule, AP Local Body Polls, AP Panchayat polls, AP Panchayat polls 2021, Mango News Telugu, Panchayat polls

ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన షెడ్యూల్ ను హైకోర్టు రద్దు చేసింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కంటే ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఆటంకం ఉండకూడదని హైకోర్టు అభిప్రాయపడింది.

ముందుగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసి, నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ గత శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌‌ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు హైకోర్టులో హౌస్‌ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్‌ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు సోమవారం నాడు విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున షెడ్యూల్ రద్దు చేయాలంటూ అన్ని వివరాలతో అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. అనంతరం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు షెడ్యూల్ అడ్డంకి కాకూడదని, ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని స్పష్టం చేస్తూ షెడ్యూల్ రద్దుపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =