మే, జూన్ నెలల్లో పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీకి కేంద్ర కేబినెట్ ఆమోదం

Union Cabinet Approves 5kg Free Foodgrains Distribution to NFSA Beneficiaries for May, June,Mango News,Mango News Telugu,Cabinet Approves Free Food Grain To Beneficiaries For 2 More Months,Union Cabinet Approves Free Food Grain Under PMGKAY 2 Months,PMGKAY,Union Cabinet,5kg Free Foodgrains Distribution to NFSA Beneficiaries,NFSA,NFSA Beneficiaries,Free Foodgrains Distribution,Cabinet Nod For Allocation Of Additional Foodgrains To NFSA,PMGKY Phase-III,Union Cabinet approves free foodgrain under PMGKAY,free foodgrain,Cabinet Approves Free Foodgrain,Cabinet Approves Extension Of Pradhan Mantri Garib Kalyan Anna Yojana,Pradhan Mantri Garib Kalyan Anna Yojana

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. మే మరియు జూన్ నెలల్లో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ లబ్ధిదారులకు ఆహార ధాన్యాల పంపిణీ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా దేశంలోని దాదాపు 79.88 కోట్ల మందికి లబ్ధిచేకూరనుంది. మే మరియు జూన్ నెలల్లో పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం/గోధుమలు అందించనున్నారు.

ఇందుకోసం కేంద్రం రూ.25333.92 కోట్లను ఖర్చు చేయనుండగా, 36789.2 మెట్రిక్ టన్నుల బియ్యం, 25731.4 మెట్రిక్ టన్నుల గోధుమలను పంపిణీ చేయనున్నారు. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద ప్రస్తుతం జరుగుతున్న కేటాయింపుల నిష్పత్తి ఆధారంగా కేంద్ర ఆహార,ప్రజా పంపిణీ శాఖ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ అదనపు కేటాయింపులు చేయనుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందిపడుతున్న ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ ఉపశమనాన్ని కలిగిస్తుందని కేంద్రం పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =