కరోనా ఎఫెక్ట్ : షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, బార్‌లు, సినిమా థియేటర్లు మూసివేత

West Bengal Govt Announced New Covid-19 Curbs to Contain the Spread of Virus,Mango News,Mango News Telugu,COVID-19 restrictions Imposed in West Bengal,Lockdown like curbs announced in Bengal,West Bengal CM Mamata Banerjee,West Bengal CM Mamata Banerjee Live,CM Mamata Banerjee Live News,CM Mamata Banerjee Live Updates,CM Mamata Banerjee Pressmeet,CM Mamata Banerjee Pressmeet Live,West Bengal Govt Announced New Covid-19 Curbs,New Covid-19 Curbs,Coronavirus,Coronavirus In West Bengal,West Bengal Covid-19,Covid-19 In West Bengal,West Bengal,West Bengal News,West Bengal Govt,West Bengal announces new Covid-19 curbs,Covid-19,West Bengal announces New curbs

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కొత్త లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను ప్రకటించింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలో విధించే ఆంక్షలపై ప్రకటన చేశారు. మరోవైపు బెంగాల్ లో ఇప్పటివరకు మొత్తం 8,98,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 7,65,843 మంది కరోనా నుంచి కోలుకోగా, 11,744 మంది మరణించారు. ప్రస్తుతం 1,20,946 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

పశ్చిమబెంగాల్ లో అమల్లోకి రానున్న కొత్త ఆంక్షలు ఇవే:

  • షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మూసివేత.
  • రెస్టారెంట్లు, బార్‌లు, క్రీడా కాంప్లెక్సులు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, బ్యూటీ పార్లర్‌లు మూసివేత.
  • నిత్యావసర దుకాణాలు ఉదయం 7 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే అనుమతి.
  • రేపటి నుంచి (మే 6) నుంచి లోకల్ ట్రైన్ సర్వీసులు నిలిపివేత.
  • రేపటి నుంచి బ్యాంకులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య మాత్రమే పనిచేయనున్నాయి.
  • రాష్ట్రంలో మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తూ నిర్ణయం.
  • రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందికి అనుమతి. అలాగే ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందికి తప్పనిసరిగా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇవ్వాలి.
  • మే 7 నుండి ముందస్తు 72 గంటల ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ లేకుండా బెంగాల్ విమానాశ్రయాలకు రావడానికి అనుమతి లేదు.
  • సామాజిక, రాజకీయ సమావేశాలపై కూడా నిషేధం.
  • పుడ్ హోమ్ డెలివరీకి చేసేందుకు అనుమతి.
  • పని ప్రాంతాల్లో, వాణిజ్య సంస్థల్లో శానిటైజేషన్ తప్పనిసరిగా చేయాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =