ఎస్సీ విద్యార్థులకు రూ.59000 కోట్లతో పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ పథకం

Union Cabinet Approves Rs 59000 Cr Post Matric Scholarship Scheme For SC Students,Mango News,Mango News Telugu,Union Cabinet Approves Investment Of Rs 59000 Crore In Post-matric Scholarship Scheme For Sc Students,Cabinet Approves Rs 59000 Crore Post-matric Scholarship Scheme For 4 Crore Sc Students,Cabinet Approves Rs 59000 Crore Post-matric Scholarship Scheme For Students,Union Cabinet Approves Rs 59000 Crore Post-matric Scholarship Scheme,Union Cabinet Approves Rs.59000 Cr Post Matric Scholarship,Cabinet Nod To Rs 59000 Crore Investment In Post-matric,Union Cabinet,Post Matric Scholarship Scheme,SC Students

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, థావర్‌చంద్‌ గహ్లోత్‌ మీడియాకు వెల్లడించారు.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు:

  • ఎస్సీలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లో రూపాంతర మార్పులకు కేబినెట్ ఆమోదం. ఎస్సీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ మొత్తం ఐదు రెట్లు పెంపు. 5 సంవత్సరాలలో 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించేందుకు మొత్తం రూ.59000 కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయం. అందులో 60 శాతం వాటాగా రూ.35,534 కోట్లును కేంద్ర ప్రభుత్వం భరించనుండగా, మిగిలిన 40 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి.
  • మౌలిక సదుపాయాలు, మానవవనరులు మరియు ఇతర వనరుల హేతుబద్ధీకరణ ద్వారా నాలుగు ఫిల్మ్ మీడియా యూనిట్ల విలీనానికి కేబినెట్ ఆమోదం. ఫిల్మ్‌ డివిజన్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌, నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కీవ్స్‌ ఆఫ్‌ ఇండియా, చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ సొసైటీ విభాగాలను నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ నిర్ణయం.
  • దేశంలో డైరెక్ట్ టు హోమ్ (డిటిహెచ్) సేవలను అందించడానికి మార్గదర్శకాల సవరణకు ఆమోదం. ప్రస్తుతం అమల్లో ఉన్న 10 సంవత్సరాల స్థానంలో 20 సంవత్సరాల కాలానికి డిటిహెచ్ లైసెన్స్ జారీ. తర్వాత లైసెన్స్ వ్యవధిని ఒకేసారి 10 సంవత్సరాలు పునరుద్ధరించుకునే అవకాశం.
  • భారత్ మరియు ఫిలిప్పీన్స్ మధ్య సవరించిన వాయు సేవల ఒప్పందానికి కేబినెట్ ఆమోదం.
  • భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సవరించిన వాయు సేవల ఒప్పందానికి కేబినెట్ ఆమోదం.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here