ఎంత ప్రయత్నించినా కాన్ఫిడెన్స్ రావడం లేదా?

Confidence is Not Coming No Matter How Hard You Try,Confidence is Not Coming,How Hard You Try Confidence,No Matter How Hard You Try,Confidence,Mango News,Mango News Telugu,Dont Underestimate, Be Confidence, Confidence Levels, Over Confident,The Only Way to Be Truly Confident,Building Self Confidence,People Have Low Self Confidence,Signs of Low Self-Esteem,The Science Behind Self-Confidence,Improving your self esteem,Build Confidence in Yourself,Become Truly Confident

ఏ చిన్న పని చేయడానికైనా కాన్ఫిడెన్స్ ఉండాల్సిందే. లేదంటే నా పనిలో ఏమైనా తప్పులున్నాయేమో… నేను కరెక్టుగా చేసానో లేదో.. నేను చేసిన తప్పులు చూసి అంతా నవ్వుతారేమోనన్న అనుమానాలు పీకుతూ ఉంటాయి. దీంతో ఏ పని చేయాలన్నా.. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా ప్రారంభించకుండానే ఆగిపోతారు. చివరకు నలుగురిలో మాట్లాడాలన్నా.. సరిగ్గా మాట్లాడలేరు. నిజం చెప్పాలంటే నిజానికి కాన్ఫిడెన్స్.. (Confidence) మన జీవితాన్ని నిరంతరం నడిపించే ఇంధనం అనే చెప్పాలి. ఇదేదో ఆకాశం నుంచి ఊడిపడదు. మనలోనే ఉంటుంది. కానీ మనలో చాలా మంది ఇంట్రోవర్ట్‌లే ఉంటారు. దాంతో ఈ కాన్ఫిడెన్స్ బయటకు కనిపించదు. మరి ఎలా ? ఎలా మనలో ఆ కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరిగేది?

ఒక పనిని పర్‌ఫెక్ట్‌గా చేయడం అనేది ఎవరూ చేయలేరు. అంతేకాదు..పక్కవాళ్లు ఎలా వర్క్ చేస్తున్నారు.. వాళ్లు మీకంటే బాగా చేస్తారేమో.. నేనే సరిగ్గా చేయనేమోనన్న అనుమానాలు వదిలేసి మీరు ఎలా వర్క్ చేస్తే రిజల్ట్ (Result) వస్తుందని అనుకుంటారో అలాగే చేసుకుంటూ పోవాలి. కానీ ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి (Don’t underestimate). అంతేకాదు మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు కామ్‌గా చేసుకోండి (Make it a com) కానీ.. నలుగురికి చెప్పి వాళ్ల నుంచి అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అంతేకానీ ఇది ఎలా చేశాను.. అది ఎలా చేశానంటూ వేరేవాళ్ల మెచ్చుకోలు కోసం అడగడం మానేయాలి. ఒకవేళ నచ్చినా కూడా కొంతమంది కావాలని తప్పులు ఎత్తి చూపిస్తే.. మీ కాన్ఫిడెన్స్ లెవల్స్ (Confidence Levels) పడిపోతాయి.

కాన్ఫిడెంట్‌గా ఉండటం అంటే మరీ ఓవర్‌గా కాన్ఫిడెంట్ (Overconfident) చూపించమని కాదు. అది మరీ తప్పులు చేసేలా చేస్తుంది. అందుకే ఏ భయం లేకుండా ధైర్యంగా పని చేసుకుంటూ పోవాలి. కొంతమంది ఒక్కరూ బయటకు వెళ్లాలన్నా.. నలుగురిలోకి వెళ్లాలన్నా.. అంతెందుకు నలుగురి ముందు మాట్లాడాలన్నా భయపడతారు. అయితే ఇలాంటి వారంతా ముందు తమను తాము మోటివేట్ చేసుకోవాలి. ఎవరూ మీకన్నా తోపు కాదన్న విషయాన్ని పదే పదే చెప్పుకోవాలి. పని ఉన్నా లేకపోయినా కల్పించుకుని మాట్లాడటం అలవాటు చేసుకుంటే నలుగురిలో బెరుకు తగ్గుతుంది. అలాగే అద్దం ముందు గట్టిగా మాట్లాడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక్కోసారి స్టేజిపైన మాట్లాడాలన్నా కూడా ధైర్యంగా మాట్లాడగలరు.

అంతేకాదు.. ఎప్పుడూ కూడా ఎవరూ కంఫర్ట్ జోన్ (Comfort Zone) చూసుకోకూడదు. అంతా కంఫర్ట్‌గా ఎవరైనా పని చేయగలరు. అది లేనప్పుడు కూడా పని చేస్తున్నప్పుడే మీలో కాన్ఫిడెంట్ లెవల్స్ ఓ రేంజ్‌లో పెరుగుతాయి. అలా కాకుండా నాకు ఈ ఉద్యగోమే బాగుంది ఇక్కడే బాగుంది అనుకుంటే పదేళ్ల తర్వాత కూడా మీ స్థానం అక్కడే. మీకంటే చిన్నవాళ్లు మీ కంటే వెనుక వచ్చిన వాళ్లు ఎక్కడో ఉంటే మీరు మాత్రం అదే పని చేస్తూ అక్కడే ఉండే పరిస్థితుల్లో ఉంటారు. నచ్చిన ఉద్యోగం చేయడంలో తప్పులేదు. కానీ మీరు చేస్తున్న పని మీకు నూరు శాతం సంతృప్తిని ఇస్తే ఓకే కానీ.. ఏ మాత్రం అసంతృప్తి ఉన్నా.. వెంటనే అక్కడి నుంచి బయట పడటానికి ప్రయత్నించాలి. ప్రతి పని కాన్ఫిడెంట్‌గా చేస్తూ ముందుకు సాగిపోవాలి. అప్పుడే విజయం మీ ముందు వినయంగా నిలబడుతుంది. సక్సెస్‌ని ఎలా తీసుకుంటారో.. ఫెయిల్యూర్‌ని కూడా అలాగే తీసుకోవడం మొదలుపెట్టండి. ఆ తర్వాత తేడా చూడండి. కాన్ఫిడెన్స్ లెవల్స్ అమాంతం పెరగడానికి ఇదే చక్కటి మార్గం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − five =