పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: మమతాబెనర్జీ హ్యాట్రిక్ విజయం

West Bengal Assembly Election Result: Mamata Banerjee's TMC Wins 213 Seats,Mango News,Mango News Telugu,West Bengal Election Result Live,West Bengal Election Results Highlights,West Bengal Election Result 2021,Bengal Election Results | West Bengal Election,West Bengal Election Result 2021 Highlights,Assembly Election Results 2021 Live Updates,West Bengal Election Results 2021,West Bengal Election Results,West Bengal Elections 2021 Result,WB Results 2021,Mamata Banerjee's TMC Wins 213 Seats,Mamata Banerjee,Mamata Banerjee Latest News,Mamata Banerjee Live,TMC Wins 213 Seats,TMC,TMC wins 213,TMC leads in 213 seats in Bengal,West Bengal Assembly Election TMC Wins

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతాబెనర్జీ నేతృత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వరుసగా మూడోసారి కూడా బెంగాల్ ప్రజలు మమతాబెనర్జీకే పట్టంకట్టారు. ఈసారి బెంగాల్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడిన కూడా మమతాబెనర్జీ ముందు నిలువలేకపోయింది. బెంగాల్లో 292 అసెంబ్లీ స్థానాలకు గాను సీఎం పీఠం దక్కించుకునేందుకు 147 స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 213 (గెలుపు+ఆధిక్యం) స్థానాల్లో సత్తా చాటింది. స్పష్టమైన మెజారిటీతో మమతాబెనర్జీ మూడోసారి సీఎం పదవిని చేపట్టనున్నారు. కాగా బీజేపీ 77 (గెలుపు+ఆధిక్యం) స్థానాలు దక్కించుకుంది. ఇతరులు 2 స్థానాలు దక్కించుకోగా లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి ఎలాంటి ప్రభావం చూపలేకపోతుంది.

అయితే పశ్చిమబెంగాల్‌లో నందిగ్రామ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన మమతాబెనర్జీ స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ స్థానంలో ప్రతి రౌండ్ లో ఉత్కంఠ నెలకుంది. మమతాబెనర్జీ, ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య విజయం చేతులుమారుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆదివారం రాత్రి సీఎం మమతా బెనర్జీపై 1736 ఓట్ల మెజారిటీతో సువేందు అధికారి గెలుపొందినట్టు ఈసీ ప్రకటించింది. అనంతరం నందిగ్రామ్ లో ఓట్లను వెంటనే రీకౌంటింగ్ చేయాలని కోరుతూ టీఎంసీ పార్టీ బెంగాల్ ప్రధాన ఎన్నికల కార్యాలయానికి నోట్ అందజేసింది. అయితే ముందుగా ఫలితాల అనంతరం మమతాబెనర్జీ మాట్లాడుతూ నందిగ్రామ్‌ ప్రత్యేకమైనదని, అక్కడి ప్రజలు ఎలాంటి ఫలితం ఇచ్చినా అంగీకరిస్తానని స్పష్టం చేశారు.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: (గెలుపు+ఆధిక్యం):

  • టీఎంసీ : 213
  • బీజేపీ: 77
  • ఇతరులు : 2
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − two =