290 చోట్ల ‘శ్రీరామ’ స్తంభాలు

Sri Rama pillars at 290 places,Sri Rama pillars,pillars at 290 places,Sri Rama places,Mango News,Mango News Telugu,290 Stone Pillars In India, 290 Stone Pillars, India, Sri Rama pillars at 290 places,Sri Ram Janmabhoomi Tirtha Kshetra Trust,Sri Ram Janmabhoomi News Today,Tirtha Kshetra Trust Latest News,290 Stone Pillars Latest News,Sri Rama pillars Latest Updates,Sri Rama pillars Live News

జగదానందకారక జయ జానకీ ప్రాణనాయక అంటే శ్రీరాముని విశిష్టత గురించి మనం సినిమాల్లో, కథల్లో, రామాయణ గ్రంధంలో చూసాం..చదివాం. అయినా భావి తరాల వారికి శ్రీరాముని చరిత్ర తెలియాల్సిన అవసరం, ఆయన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భావిస్తోంది.
దీనికోసం త్వరలోనే శ్రీరాముడి జీవిత చరిత్రతో పాటు..రామయ్య ప్రాముఖ్యతను తెలియజెప్పడానికి 290 ప్రదేశాల్లో ‘శ్రీరామ’రాతి స్తంభాలను నిర్మించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తాజాగా తెలిపారు. ఆ రాతి స్థంభాల నిర్మాణానికి అయ్యే ఖర్చును ఓ స్వచ్ఛంద సంస్థ భరిస్తుందని ఆయన వివరించారు.

తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం ఉత్తర్​ ప్రదేశ్​‌లోని అయోధ్య రామమందిరానికి సంబంధించిన ఓ కీలక ప్రకటన చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. భారత దేశంలోని మొత్తం 290 ప్రాంతాల్లో ‘శ్రీరాముని పేరుత రాతి స్తంభాలను ఏర్పాటు చేయనున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి ఖర్చును అశోక్ సింఘాల్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ భరిస్తుందని అన్నారు. శ్రీరాముని రాతి స్థంభాల నిర్మాణంలో ప్రభుత్వానికి చెందిన ఒక్క రూపాయిని కూడా వాడబోమని రాయ్​ చెప్పారు.

భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించనున్న మొత్తం 290 స్తంభాలకు అయ్యే పూర్తి ఖర్చులను.. అశోక్ సింఘాల్ ఫౌండేషనే ఖర్చు చేస్తుందని రాయ్ తెలిపారు. శ్రీరాముడి జీవిత చరిత్రతో పాటు రాముడి ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా శ్రీరాముని రాతి స్తంభాలు ఉంటాయని వివరించారు. అలాగే వీటిని ఏర్పాటు చేసే స్థలానికి సంబంధించి ..వాల్మీకి రామాయణంలో ఉన్న స్థల పురాణం వంటి వివరాలను అందరికీ అర్థమయ్యే విధంగా స్థానిక భాషలోనే ఉండేలా చూస్తామని శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెప్పారు.

ఢిల్లీలో ఉన్న అశోక్ సింఘాల్ ఫౌండేషన్‌కు.. శ్రీరాముడి జీవితం,రాముడి విశిష్టతను భావితరాలకు తెలియజేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. దీంతో శ్రీరాముడి జీవిత విశేషాలను రాతి స్తంభాలపై చెక్కి దేశంలోని ప్రముఖ ప్రదేశాల్లో స్థాపించాలనేది ఈ స్వచ్ఛంద సంస్థ భావిస్తోంది. వీటితో పాటు ఇప్పుడు ఏర్పాటు చేసే రాతి స్తంభాలపై.. వాల్మీకి రామాయణంలోని ఆయా స్థలాల ప్రాముఖ్యతను వివరించే విధంగా ఉండేలా వాల్మికీ శ్లోకాలను కూడా స్తంభాలపై పొందుపరచాలనేది ఫౌండేషన్​ అనుకుంటోంది. అందుకే వీటిని ఆయా ప్రాంతాలవాళ్లు అర్ధం చేసుకునేలా వీటిని స్థానిక భాషలోనే ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని రాయ్ తెలిపారు.
ఈ 290 శ్రీరాముని రాతి స్తంభాల ఏర్పాటు మహా కార్యక్రమంలో భాగంగా తయారు చేయిస్తున్న మొదటి స్థూపం.. ఈ బుధవారం అంటే సెప్టంబర్​ 27న అయోధ్యకు చేరుకుంటుందని రాయ్ చెప్పారు. మొదటి రాతి స్థంభాన్ని మణి పర్వతంపై ప్రతిష్ఠిస్తామని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 15 =