నో ఫోన్ నంబర్

Customers No Need to Give Their Mobile Number at shopping Malls,Customers No Need to Give Their Mobile Number,Mobile Number at shopping Malls,No Need to Give Their Mobile Number,Customers at shopping Malls,Mango News,Mango News Telugu,Customers No Need to Give Their Mobile Number, at shopping Malls, Shopkeepers, Dont Ask Customer Mobile Number, at Billing Time, Mobile Number,Mobile Number at Malls News Today,Mobile Number at Malls Latest News,Mobile Number at Malls Latest Updates

సూపర్ మార్కెట్‌కు వెళ్లినా.. షాపింగ్ మాల్‌లో అయినా మనం కొనేవాటికి.. బిల్ కట్టేప్పుడు బిల్లింగ్ చేసేవాళ్లు మన మొబైల్ నెంబర్ అడగడం, ఆ తర్వాతే బిల్ ప్రాసెస్ పూర్తి చేయడం మనం రెగ్యులర్‌గా చూస్తుంటాం. అయితే ఇకపై బిల్లు కోసం ఫోన్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నాయి కొత్త రూల్స్

ఏదైనా మాల్‍లేదా సూపర్ మార్కట్స్‌కు వెళ్లి షాపింగ్​ చేసి బిల్ పే చేసే సమయంలో అక్కడ కౌంటర్ దగ్గర సిబ్బంది.. కస్టమర్ మొబైల్​ నెంబర్ అడుగుతారు. ఎందుకు అంటే ఫోన్ నంబర్‌ ఎంటర్ చేసినప్పుడు మీ బిల్లు ఎమౌంట్ దీనికి యాడ్ అవుతుంది. ఇలా మీరు ఎప్పుడు షాపింగ్ చేసినా మీరు చేసిన బిల్లుపై కొన్ని పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. దీంతో మీరు తర్వాత డిస్కౌంట్ పొందడమో.. లేక ఉచితంగా షాపింగ్ చేయడమో చేయొచ్చని చెబుతారు. దీంతో మొబైల్ నెంబర్ చెప్పి, బిల్ పేమెంట్ చేసి వెళ్లిపోతుంటారు.

అయితే ఇలా చెప్పేటప్పుడు పక్కన వేరే మైండ్ సెట్‌తో ఉన్నవాళ్లు ఉన్నా.. లేదా లాటరీల పేరుతో ఫోన్ నంబర్లు సేకరించే టీమ్ ఉన్నా ఆ మొబైల్ నంబర్‌ ప్రైవసీ కోల్పోయినట్లే అవుతుంది. మరికొన్ని చిన్నచిన్న షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు వారి దగ్గర నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఫోన్ కాల్స్, మెసేజ్​ల ద్వారా జరుగుతున్న మోసాలు పెరుగుతుండటంతో.. కస్టమర్ల ప్రైవసీకి మరింత భద్రత కల్పించడానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రిటైల్ షాప్స్‌లో బిల్లు జనరేట్ చేసేటప్పుడు కొనుగోలుదారులు ఫోన్​ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్డర్స్ జారీ చేసింది.

అలాగే షాపుల్లో లేదా బయట ఎక్కడైనా కూడా ఎవరి దగ్గర కూడా ఫోన్ నెంబర్లు సేకరించకూడదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ చెబుతోంది. ఇప్పుడు అన్ని షాపింగ్ మాల్స్ వ్యక్తిగత వివరాలు అందించే వరకు.. తాము ఎలాంటి బిల్ ప్రాసెస్ పూర్తి చేయలేమని చెబుతుంటారు. కానీ ఇది కస్టమర్ల రక్షణ చట్టం ప్రకారం అన్యాయమైన, నిర్బంధ వాణిజ్య పద్ధతి కిందకు వస్తుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ అభిప్రాయ పడింది.

ఇలా ఫోన్ నంబర్లు సేకరించడం వెనుక కస్టమర్ల ప్రైవసీకి సంబంధించిన ఆందోళనలు కూడా ఉన్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ చెబుతోంది. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం..కొనుగోలుదారుల వివరాలు సేకరించకూడదని, వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా రిటైల్ పరిశ్రమ, ఇండస్ట్రీ ఛాంబర్స్‌కు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) వంటి వాటికి అడ్వైజరీ జారీ చేసినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది.

మాల్ నుంచి కానీ.. షాపుల నుంచి కానీ ఏదైనా డెలివరీ చేయడానికి లేదా బిల్లు ఇవ్వడానికి రిటైలర్లకు ఫోన్ నంబర్‌లను అందించాల్సిన అవసరం లేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ చెప్పింది. కాబట్టి కొనుగోలుదారులు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ చెబుతోంది. సూపర్ మార్కెట్, మాల్‌లో ఏదైనా వస్తువులు కొని, బిల్లు చెల్లించే సమయంలో.. మీరు ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అక్కడి సిబ్బంది మొబైల్ నెంబర్ ఇవ్వాలని పట్టుబడితే ..వారికి కొత్తగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ తీసుకువచ్చిన రూల్స్ గుర్తు చేయండి.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 20 =