ఏపీ కాంగ్రెస్‌లోకి షర్మిల.. రంగం సిద్ధం

Sharmila Joins AP Congress The Field Is Ready, Sharmila Joins AP Congress, AP Congress The Field Is Ready, AP Congress Sharmila, Ys Sharmila, Telangana, Karnataka, Congress Party, AP State, Elections, Members, Latest Sharmila Political News, CM Jagan, Chandrababu Naidu, AP CM, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
ys sharmila , Telangana, Karnataka, congress party , ap state , elections , members

కర్ణాటక, తెలంగాణలో గెలుపుతో ఫుల్ జోష్‌లో ఉంది కాంగ్రెస్ పార్టీ. అదే జోష్‌ను త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కూడా కంటిన్యూ చేయాలని భావిస్తోంది. మరిన్ని రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. ఈ మేరకు మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరగబోయే ఆంధ్రప్రదేశ్‌పై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. తిరిగి ఆంధ్రప్రదేశ్‌ను హస్తగతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు ఏపీకి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ మూడు అంశాలపై దృష్టి పెట్టింది.

కాంగ్రెస్ కర్ణాటకలో ప్రకటించిన ఐదు గ్యారెంటీలు.. తెలంగాణలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు సూపర్ సక్సెస్ అయ్యాయి. కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చాయి. దీంతో ఆయా గ్యారెంటీలను ఏపీలో కూడా ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ఏపీ ప్రజలకు ఏయే గ్యారెంటీలు ప్రకటించాలనే దానిపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇక రెండో అంశం.. ఏపీలోనూ  ఘర్ వాపసీకి శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గతంలో పార్టీని విడిచి ఇతర పార్టీల్లోకి వెళ్లినవారిని తిరిగి తమ పార్టీలోకి రప్పించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే పార్టీని విడిచి పెట్టి వెళ్లిన వారికి కాంగ్రెస్ ఆహ్వానం ప్రకటించింది.

ఇక మూడోది అతి ప్రధానమైనది.. వైఎస్ షర్మిలను పార్టీలోకి ఆహ్వానించి పార్టీ పగ్గాలు చేతికివ్వాలని హైకమాండ్ భావిస్తోంది. ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిలను నియమించాలని హైకమాండ్ భావిస్తోంది. నిజానికి తెలంగాణ ఎన్నికల కంటే ముందే.. తన వైఎస్సార్‌టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు షర్మిల సిద్ధపడింది. ఈ మేరకు హైకమాండ్‌తో పలు మార్లు మంతనాలు కూడా జరిపింది. ఇక పార్టీ విలీనానికి రంగం సిద్ధమయింది.. రేపో, మాపో కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ పార్టీ విలీనం అవుతుందని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ చివరి నిమిషంలో అనూహ్యంగా విలీన ప్రక్రియ ఆగిపోయింది. అయినప్పటికీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా షర్మిల కాంగ్రెస్‌కు మద్ధతిచ్చారు.

ఇప్పుడు ఏపీ ఎన్నికల ముంగిట షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే ఓ చిన్న సమస్య ఎదురయింది. కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించాలని చూస్తుంటే.. షర్మిల మాత్రం తెలంగాణవైపు చూస్తోందట. తెలంగాణకు దూరమవ్వడానికి సిద్ధంగా లేరట. ఇప్పటికే ఈ విషయం గురించి హైకమాండ్‌ షర్మిలతో చర్చించగా.. తన నో చెప్పేశారట. ఈక్రమంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్‌గా అయినా బాధ్యతలు స్వీకరించాలని హైకమాండ్ షర్మిలపై ఒత్తిడి చేస్తోందట. మరి అబ్జర్వర్‌గా అయిన షర్మిల బాధ్యతలు స్వీకరిస్తారా..? లేదా..? అనేది చూడాలి.

మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు మేరకు షర్మిల గురువారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం కావడంతో.. ఇదే రోజున షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మరి షర్మిల కాంగ్రెస్‌లో చేరడం ద్వారా.. పార్టీకి ఎంత వరకు లబ్ధి చేకూరుతుందనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − eleven =