ఎక్సర్‌సైజ్‌లు చేసేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు..

Exercise Tips, 40 Plus Age People, Exercise Tips for 40 Plus Age People, Exercise Mistake,Exercise Tips for 40 Plus,doing exercises?, Exercise, Running, Yoga, Walking, Workout Tips, Health Tips, Workouts, Fitness Tips for People Over 40, Mango News Telugu, Mango News
Exercise Mistake,Exercise Tips for 40 Plus,doing exercises?,Exercise,Running, Yoga, Walking

మనిషి ఏజ్ పెరుగుతున్న రోగ నిరోధక శక్తి తగ్గడంతో శరీరంలో రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వయసు మీద పడటం వల్ల శరీరం సామర్థ్యం తగ్గడం ప్రారంభమవుతుంది. 40 ఏళ్ల తర్వాత కండరాల బలం మెల్లగా తగ్గడం మొదలవుతుంది.అటువంటప్పుడు వ్యాయామాలు చేయడం, మంచి ఫుడ్ తినడం, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం  చేయాలి. ముఖ్యంగా అంతా రెగ్యులర్‌గా వాకింగ్, యోగా, ఎక్సర్‌సైజులు వంటివి చేయడం తప్పనిసరిగా మార్చుకోవాలి.

వ్యాయామం చేసేటప్పుడు కొంతమంది ఏం చేయాలో తెలియక ఎలా పడితే అలా చేసేస్తారు. కానీ 40 ఏళ్ల వయస్సు దాటాక వ్యాయామం చేసేటప్పుడు కొన్ని  తప్పులు చేయకూడదని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. 40 సంవత్సరాల దాటాక శరీరంలో త్వరగా కోలుకునే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే ఎక్కువ వ్యాయామాలు చేయకూడదు. దీనివల్ల చిన్న చిన్న గాయాలపాలయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అన్ని రోజులు చేయాల్సిన అవసరం లేదు. వారానికి 3 నుంచి 4 రోజులు వ్యాయామం చేస్తే చాలు. అంతేకాదు ప్రతి రోజు వ్యాయామాన్ని 40 నిమిషాల నుంచి గంట వరకూ పరిమితం చేయడం మంచిది. గంటల తరబడి చేయాల్సిన పనిలేదు.

అలాగే వ్యాయామానికి ముందు, వ్యాయామం తరువాత తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి.  వ్యాయామానికి ముందు, తరువాత విశ్రాంతి తీసుకోవడం మర్చిపోవద్దు. ఇది  కండరాలను సడలించడంలోనూ.. ఎలాంటి గాయం  కాకుండా రక్షించడంలోనూ పనికొస్తుంది.  వ్యాయామం చేసే సమయంలో శరీరానికి ఎక్కువగా చెమటలు పడతాయి. అలాంటి పరిస్థితుల్లో నీళ్లు తాగకుండా ఎక్సర్‌సైజులు కంటెన్యూ చేస్తే డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే వ్యాయామానికి ముందు నీళ్లు తాగాలి. అలాగే మధ్యలో దాహం అనిపించినా నీళ్లు తాగాలి.

అంతేకాకుండా 40 ఏళ్లు దాటిన వాళ్లు వ్యాయామాలు చేసినప్పుడు కీళ్లపై ఎక్కువ ఒత్తిడి కలుగుకుండా చూసుకోవాలి. రన్నింగ్, జంపింగ్ వంటి హై ఇంపాక్ట్ ఎక్సర్‌సైజులకు బదులు స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా వంటి తక్కువ ఇంపాక్ట్ ఉండే ఎక్సర్‌సైజులు  చేస్తే మంచిది అని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. అలాగే వేగంగా చేసే వ్యాయామాలను ఎంచుకోకుండా ఉండటమే బెటర్ అని అంటున్నారు.ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత మాత్రమే వ్యాయామం చేయాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + nine =