తెలంగాణలో బీజేపీతో పవన్ పొత్తుతో పొలిటికల్ లెక్కలు మారుతాయా?

Did Pawan make a mistake by allying with BJP,Did Pawan make a mistake,allying with BJP,Pawan make a mistake by allying,Mango News,Mango News Telugu,Pawan mistake,BJP, political calculations, Pawans alliance with BJP, Telangana,Modi,Janasena,Janasena Latest News,Janasena Latest Updates,Telangana Latest News,Telangana Latest Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates
Pawan mistake,BJP, political calculations, Pawan's alliance with BJP, Telangana,Modi,Janasena,

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీ తరుపున పవన్ ప్రచారానికి వచ్చాడు. నిజానికి ఇక్కడ బీజేపీకి ఓట్లేసే వాళ్లే తక్కువ. ఇక పవన్ పొత్తు పెట్టుకుని పరువు తీసుకోవడం అవసరమా? అని విశ్లేషిస్తున్నారు రాజకీయవేత్తలు.

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోరు జరిగేది బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనేనని ఇప్పటికే ఎన్నో సర్వేలు చెప్పాయి. అయినా బీజేపీ తన అదృష్టాన్ని మళ్లీ పరీక్షించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈసారి పవన్ కళ్యాణ్ సాయాన్ని తీసుకుంటోంది. జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగుతోంది బీజేపీ. పవన్ చెప్పినంత మాత్రం తెలంగాణాలోని ప్రజలు ఓట్లేసేంత ఛాన్సు కనిపించడం లేదు. ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్… నువ్వానేనా అన్న రేంజ్లో తలపడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

 

మధ్యలో వచ్చిన బీజేపీ, పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు అయిపోవచ్చు. పవన్ కళ్యాణ్ పాపులారిటీ బీజేపీకి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.  2018 ఎన్నికల్లో కేవలం ఒక్కస్థానానికే పరిమితం అయింది బీజేపీ. ఈసారి మాత్రం ఎన్నికల్లో విజయం సాధిస్తామని గంభీరంగా చెబుతోంది. అదంతా మేకపోతు గాంభీర్యమేనని అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి అధినాయకత్వంలో కాంగ్రెస్ బలంగా పుంజుకుంటోంది. ఆ బలం ముందు బీజేపీ, పవన్ నిలవలేకపోవచ్చు. గతంలో దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచినా… అది అక్కడ నిలుచున్న అభ్యర్థుల బలమేనని, పార్టీ బలం కాదని అందరికీ తెలిసిందే.

 

తెలంగాణా బీజేపీ నాయకులు పవన్ కు చాలా ప్రాధాన్యతనిస్తున్నారు. టీడీపీ పోటీలో లేకపోవడం, పవన్ మద్దతు లభించడంలో సెటిలర్ల ఓట్లు తమకే పడతాయని బీజేపీ భావిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తెలంగాణాలో తమ క్యాడర్‌ను బీజేపీకే మద్దతు ఇవ్వాలని ఆదేశించారు. కానీ క్యాడర్ మాత్రం కాంగ్రెస్ వెంట నడవాలని భావిస్తోంది. ఇలా అయితే బీజేపీ ఆశలు అడియాశలే. బీజేపీ కొన్ని స్థానాల్లోనైనా గెలిస్తే ఫర్వాలేదు, లేకుంటే పొత్తు పెట్టుకున్న పవన్ పరువు పోయినట్టే.

 

నిజం చెప్పాలంటే తెలంగాణా రాజకీయాల్లో  బీజేపీకి పట్టు లేదు, పవన్ కు ఇక్కడ రాజకీయాలపై అవగాహన లేదు. ఇక వీరిద్ధరూ కలిసి చరిత్ర సృష్టించేంత అవకాశమూ లేదన్న వాదన వినిపిస్తోంది.  బీజేపీ , జనసేన కాంబో కనీసం పది నుంచి 15 స్థానాల్లో గెలిస్తే పవన్ కళ్యాణ్ కు కాస్త గౌరవం దక్కుతుంది. సింగిల్ డిజిట్ స్థానాల్లోనే మిగిలిపోతే పవన్ వల్ల ఒరిగేదేమీ లేనట్టే. పైగా తనకు తానుగా వచ్చి పరువు తీసుకున్నవాడిగా మిగిలిపోతాడు.తప్పకుండా ఇది ఏపీ ఎన్నికల్లోనూ ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − twelve =