మొబైల్ ఫోన్‌ను ఎన్నేళ్లు వాడాలో తెలుసా?

An expiry date for smart phones,Expiry date for phones,Date for smart phones,An expiry date for smart phones, mobile phone,mobile phone expiry date, phones , Samsung, I-Phone, Nokia, Sony, Jio,Average lifespan of a smartphone,Mango News,Mango News Telugu,Your Phone Has an Expiration,How Long do Smartphones Last,smart phones Latest News,smart phones Latest Updates,smart phones Expiry date Live Updates
An expiry date for smart phones, mobile phone,mobile phone expiry date, phones , Samsung, I-Phone, Nokia, Sony, Jio

రానురాను మనిషికి మొబైల్ ఫోన్స్ కర్ణుడి కవచకుండలాలుగా తయారవుతున్నాయి. ఏం ఉన్నా, ఏం లేకపోయినా ఒక్కమొబైల్ ఫోన్ ఉంటే చాలు అన్నట్లుగా మనిషిని ఎడిక్ట్ చేసేసింది. ఒకప్పుడు లగ్జరీ ఐటెమ్ కాస్తా తర్వాత అవసరంగా మారింది. ఆ తర్వాత అదే వ్యసనంగా మారిపోయి ఫోన్ లేకపోతే మనిషి బతకలేడు అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. . అవసరం కోసం స్మార్ట్ ఫోన్ ను కొందరు వాడుతుంటే.. వినోదం కోసం, విజ్ఞానం కోసం  వాడేవాళ్లు కూడా చాలామంది ఉన్నారు.

స్మార్ట్‌ఫోన్ కొనేటపప్పుడు కాస్త ధర ఎక్కువ అయినా కావాల్సిన ఫీచర్లు కావాలంటూ వినియోగదారుడు డిమాండ్ చేస్తున్నాడు. ఏ కాస్ట్, కెమెరా ఎలా ఉంది, ఫీచర్లు ఎలా ఉన్నాయి అంటూ రకరకాల ఎంక్వైరీలు చేసి కానీ ఎవరూ స్మార్ట్ ఫోన్ కొనడం లేదు. అయితే మొబైల్ ఫోన్ ఎంతకాలం పనిచేస్తుంది? దానికీ  ఓ  ఎక్స్ పైరీ డేట్ ఉంటుందా.. అనే విషయాన్ని మాత్రం ఎవరూ ఆలోచించరు.

ఎందుకంటే స్మార్ట్ ఫోన్‌ను జాగ్రత్తగా  వాడితే చెడిపోదనే ఆలోచన చాలామందిలో ఉంటుంది.  కానీ దానిలో ఏమాత్రం నిజం లేదని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్ మెయిన్ బాడీని ఎన్నాళ్లయినా సురక్షితంగా ఉంచుకోవచ్చు కానీ.. దాని ఇంటర్నల్‌లలో ఏదైనా డ్యామేజ్ జరిగితే మాత్రం దానిని ఎవరూ  ఏమీ చేయలేరు. అందుకే ఫోన్ బ్యాటరీలాగే ఫోన్లో వాడే ఇంటర్నల్స్‌కు కూడా  మందులు,ఆహార పదార్థాల మాదిరిగానే ఎక్స్ పైరీ డేట్ ఉంటున్నట్లే లెక్కలేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ ఎక్కువ కాలం వాడుతున్న కొద్దీ దాని వల్ల రేడయేషన్ ఎఫెక్ట్ కూడా ఎక్కువయ్యే అవకాశాలుంటాయి కాబట్టి.. ఎక్కువ కాలం వాడకపోవడమే మంచిదని అంటున్నారు.

స్మార్ట్‌ఫోన్‌కు పర్టికులర్‌గా ఒక ఎక్స్ పైరీ డేట్ లేనప్పటికీ, రకరకాల కారణాల వల్ల అది పాడైపోతుంది.  నిజానికి స్మార్ట్‌ఫోన్ వయస్సు దాదాపు  నాలుగేళ్లు.. మహా అంటే ఐదేళ్లు. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లకు అంతకంటే తక్కువగా కూడా  ఉండొచ్చు. స్మార్ట్‌ఫోన్ కంపెనీల బట్టి దాని  ఎక్కువ లేదా తక్కువగా పనిచేయడం ఉంటుంది. ఉదాహరణకు ఆపిల్ ఫోన్ 4-8 సంవత్సరాలు సౌకర్యవంతంగా వాడుకోగలం. అలాగే శాంసంగ్ ఫోన్  3 నుంచి 6 సంవత్సరాలు ఉపయోగించగలం.

బ్యాటరీ పాడైతే ఫోన్ సరిగ్గా పని చేయదు.  ఈ బ్యాటరీలలో ఉపయోగించే రసాయనాలు కొంత టైమ్  తర్వాత క్షీణించడంతో.. బ్యాటరీ చెడిపోతుంది. అంతేకాదు ప్రతీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వెనుక ఆ కంపెనీ ఎక్స్‌పైరీ డేట్‌ను ముద్రించే ఉంచుతుంది. స్మార్ట్‌ఫోన్ యొక్క ఎక్స్ పైరీ డేట్  కూడా దాని బ్యాటరీ యొక్క ఎక్స్ పైరీ డేట్  పై ఆధారపడి ఉంటుంది. పాడైన బ్యాటరీని మారిస్తే.. స్మార్ట్‌ఫోన్‌ను మరి కొద్ది కాలం పాటు ఉపయోగించవచ్చు. దీనితో పాటు బ్యాటరీని చార్ట్ చేసే విధానాన్ని బట్టి ఫోన్ లైఫ్  పెరగడం, తగ్గడం ఆధారపడి ఉంటాయి.

ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో రిలీజ్ అయ్యాక ..   ఓ  2-3 సంవత్సరాల తర్వాత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు రావడం ఆగిపోతున్నాయి . దీంతో తప్పనిసరిగా అప్ డేటెడ్ వెర్షన్‌ కోసం మరో కొత్త మొబైల్ ఫోన్‌ను కొనాల్సి వస్తుంది. అంతేకాదు ఏదైనా కంపెనీ తమ మొబైల్ మార్కెట్లోకి రిలీజ్ చేశాక..  2-3 ఏళ్ల తర్వాత ఆ స్మార్ట్‌ఫోన్‌లకు యాక్సెసరీలను తయారు చేయడం కూడా ఆపేస్తున్నారు. ఈ కారణాలవల్ల కూడా మరో కొత్త మొబైల్ కొనాల్సి వస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − seven =