ఆర్‌ఎల్‌డీ అధినేత అజిత్‌ సింగ్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

CM KCR has Mourned the Death of Rashtriya Lok Dal President Chaudhary Ajit Singh,Mango News,Mango News Telugu,Ajit Singh death,Former Union Minister Ajit Singh,Former Union Minister Ajit Singh Latest News,RLD Chief Ajit Singh,RLD Chief Ajit Singh Passes Away Due To Covid-19,Former Union Minister Ajit Singh Passed Away,Ajit Singh Dead,RLD Chief Ajit Singh Death News,CM KCR has Mourned the Death of Ajit Singh,CM KCR,CM KCR Latest News,CM KCR Live,CM KCR Live News,CM KCR Live Updates,Telangana CM KCR condoles Ajit Singh's death,Telangana CM KCR Condenses The Death Of Ajit Singh,CM KCR Mourns Ajit Singh's death,CM KCR Condenses Ajit Singh's death,CM KCR Condoles Demise Of Ajit Singh

కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పలు దఫాలు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలను చేపట్టిన అజిత్ సింగ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగించారని, రైతునేతగా భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన రాజకీయ ప్రక్రియకు అజిత్ సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతు పలికిన వారి జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని సీఎం అన్నారు. దివంగత అజిత్ సింగ్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + eleven =