ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. షెడ్యూల్‌కు వారం ముందే ఉభయ సభలు నిరవధిక వాయిదా

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్‌ ఉభయ సభలను సభాపతులు నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే షెడ్యూల్‌ కంటే వారం ముందుగానే వాయిదా పడటం విశేషం. కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను తొలుత అనుకున్న సమయానికి కాకుండా కొంచెం ముందుగానే ముగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో నేడు లోక్‌సభ, రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇక డిసెంబర్ 7న ప్రారంభమైన ఈ శీతాకాల సమావేశాల్లో ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌ ఇండో-చైనా బోర్డర్ వద్ద చోటుచేసుకున్న ఇరుదేశాల సైనికుల ఘర్షణపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. అలాగే ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యపై కూడా చర్చకు పట్టుబట్టాయి. ఈ క్రమంలో పలుసార్లు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఇంకా దేశంలో కోవిడ్ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా మన్సుఖ్ మండవియా సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =