జులైలో టీఎస్ ఎంసెట్-2021‌ నిర్వహణ, పూర్తి షెడ్యూల్‌ విడుదల

EAMCET 2021, EAMCET 2021 Exam, EAMCET 2021 Exam Date, EAMCET-2021 Schedule, EAMCET-2021 Schedule Released, Mango News, Telangana EAMCET 2021, Telangana EAMCET-2021 Exam, Telangana EAMCET-2021 Schedule, Telangana EAMCET-2021 Schedule Released, Telangana EAMCET-2021 Schedule Released Today, TS EAMCET 2021 Exam Dates

తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్ ఎంసెట్-2021 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి శనివారం నాడు విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షను సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో నిర్వహించనున్నారు. జులై 5, 6 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా‌ పరీక్షలు, జులై 7,8,9 తేదీల్లో ఇంజినీరింగ్‌ పరీక్షలను రోజుకు రెండు సెషన్స్ లలో నిర్వహించనున్నారు. ఎంసెట్-2021 లో ఇంటర్‌ ‌ప్రథమ సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్, ద్వితీయ సంవత్సరం నుంచి 70 శాతం సిలబస్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు. పరీక్ష పేపర్ నమూనాలో (160 ప్రశ్నలు-3 గంటల సమయం) ఎలాంటి మార్పులేదని చెప్పారు. శనివారం నాడు జరిగిన టీఎస్‌ ఎంసెట్ టెస్ట్‌ కమిటీ తొలి సమావేశం అనంతరం షెడ్యూల్ ను ఖరారు చేశారు. 2021 సంవత్సరానికి గానూ ఎంసెట్ ప్రవేశ పరీక్షను జేఎన్టీయూ యూనివర్సిటీ నిర్వహించనుంది.

టీఎస్ ఎంసెట్-2021 పరీక్షషెడ్యూల్:

  • నోటిఫికేషన్‌ విడుదల: మార్చి 18
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మార్చి 20
  • దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ (ఆలస్య రుసుము లేకుండా) : మే 18
  • ఆలస్య రుసుము రూ.250 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 28
  • ఆలస్య రుసుము రూ.500 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 7
  • ఆలస్య రుసుము రూ.2500 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 17
  • ఆలస్య రుసుము రూ.5000 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 28
  • ఎంసెట్-2021 పరీక్ష నిర్వహణ (అగ్రికల్చర్, ఫార్మా‌ పరీక్షలు) : జులై 5, 6
  • ఎంసెట్-2021 పరీక్ష నిర్వహణ (ఇంజినీరింగ్) : జులై 7,8, 9
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =