నగరంలో న్యూ ఇయర్ ఈవెంట్స్ పై కీలక ఆదేశాలు చేసిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

Hyderabad cops make vaccine certificates mandatory, Hyderabad CP CV, Hyderabad CP CV Anand, Hyderabad CP CV Anand about Restrictions, Hyderabad CP CV Anand Announced Restrictions, Hyderabad CP CV Anand Announced Restrictions on New Year Events, Hyderabad police issue tough guidelines, Hyderabad police issue tough guidelines for New Year parties, Mango News, New Year 2022, New Year celebrations in Telangana, Two doses must to attend New Year parties

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర పార్టీలకు అర్థరాత్రి వరకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. గ్రేటర్‌ పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో న్యూ ఇయర్‌ ఈవెంట్స్ నిర్వాహకులకు సిటీ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించే వారు రెండు రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాని సూచించారు. కార్యక్రమం నిర్వహణకు 48 గంటల ముందే నిర్వాహకులు, ఉద్యోగులు, సిబ్బందికి కోవిడ్‌ పరీక్షలు చేయించాలి. ఈవెంట్స్ నిర్వహించే వారు తప్పనిసరిగా రెండు డోసులు వేసుకున్నవారినే వేడుకలకు అనుమతించాలని చెప్పారు. వేడుకలలో పాల్గొంటున్న వారందరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలని.. లేదంటే వేయి రూపాయల జరిమానా విధిస్తామని చెప్పారు. కార్యక్రమం జరిగే చోట భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి.

వేడుకలలో అసభ్యకర డెస్స్‌లు ధరించినా, డాన్సులు చేసినా చర్యలు తీసుకోనున్నారు. మాదకద్రవ్యాలను అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సీవీ అనంద్ అన్నారు. ఎక్సైజ్‌ విభాగం నిర్దేశించిన సమయానికి మించి మద్యం సరఫరా చేయకూడదు. ఇక బహిరంగ ప్రదేశాల్లో డీజేలకు అనుమతి లేదు. ఇతరులకు ఇబ్బంది కల్గించే విధంగా ఉంటే తగిన చర్యలు తీసుకుంటారు. కపుల్స్‌ కోసం నిర్దేశించిన పార్టీల్లోకి మైనర్లను అనుమతించకూడదు. బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌లో లైవ్‌ బ్యాండ్స్‌ నిర్వహించకూడదు. మద్యం మత్తులో ఉన్న వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేలా డ్రైవర్లు/క్యాబ్‌లను నిర్వాహకులు ఏర్పాటు చేయాలి. కార్యక్రమం జరిగే ప్రాంతంలోనే పార్కింగ్‌ సౌకర్యం కల్పించాలి. రహదారులపై వాహనాలు ఆపేలా చేయకూడదు. ఎంట్రీ, ఎగ్జిట్‌లు వేర్వేరుగా అవసరమైన స్థాయిలో ఉండాలి.

డిసెంబర్‌ 31 వ తేదీన వైన్స్‌లు రాత్రి 12 గంటల వరకు ఓపెన్‌ ఉన్నప్పటికీ.. డ్రంకన్‌ డ్రైవ్‌ ఉంటుందని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కితే రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటాయి. డ్రైవింగ్‌ లైసెన్సులు రద్దు అవుతాయి. మైనర్లు డ్రైవింగ్‌ చేస్తే వాహన యజమానులదే బాధ్యత. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి హైకోర్టు ఆంక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో క్రిస్మస్ వేడుకలు ముగిసిన తర్వాత జనవరి 2 వ తేదీ వరకు కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసు శాఖతో పాటు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 9 =