ప్రారంభమైన ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌, దేశంలోనే హైదరాబాద్‌లో మొదటిసారిగా నిర్వహణ

Hyderabad The Two-Day Indian Racing League Trail Run Begins at Tankbund Huge Crowd Attends To Watch Racing,Hyderabad Indian Racing League,Trail Run Begins,Indian Racing League Trail Run,Indian Racing League at Tankbund,Mango News,Mango News Telugu,Formula E Race,Formula E Race Hyd,Hyderabad Formula E Race,Hyderabad Formula 1 Race,Formula E Race Nov 16 To Nov 20,Formula E Race Latest News And Updates,Traffic Diversion In Hyderabad

ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ పోటీలో భాగంగా రెండు రోజుల పాటు జరుగనున్న ట్రయల్ రన్ హైదరాబాద్‌లో నేడు ప్రారంభమైంది. హుస్సేన్‌సాగర్‌ తీరాన ఈరోజు, రేపు జరుగుతున్న పోటీల కోసం ట్యాంక్‌బండ్‌ పరిసరాలను తీర్చిదిద్దారు. ఇక కార్‌ రేసింగ్‌ శనివారం ఉదయం ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఉన్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నుంచి ఉదయం 8.30కు ప్రాక్టీస్‌ మొదలయింది. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు పోటీ ప్రారంభం అయింది. కాగా ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఈ స్ట్రీట్‌ రేసింగ్‌ దేశంలోనే మొదటిసారి కావడం విశేషం.

కాగా ఇండియన్ రేసింగ్ లీగ్ అనేది కొన్ని ప్రత్యేకమైన నగరాలలో నిర్వహించే రేసింగ్ ఛాంపియన్‌షిప్. దీనిలో లీగ్-శైలి ఫార్మాట్‌లో మొత్తం 6 జట్లు పోటీపడనుండగా, ప్రతి జట్టులో 4గురు డ్రైవర్లు ఉంటారు. అయితే వీరిలో ఇద్దరు భారతీయులు కాగా, మరో ఇద్దరు అంతర్జాతీయ డ్రైవర్లు, అందునా ఒక మహిళా డ్రైవర్‌ ఉంటారు. ఈ విధంగా మొత్తం 24 మంది రేసర్లు పాల్గొంటారు. ట్రాక్‌లో ప్రతి 20నిమిషాల చొప్పున డ్రైవర్లు మారుతారు. ఇక రేసులో ఉపయోగించే ఒక్కో కారు 1600సీసీ సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే ఈ కార్లు అన్నిటికి ఇటలీ ఇంధనమే వినియోగిస్తారు.

ఈ నేపథ్యంలో ఈ పోటీలను వీక్షించేందుకు ప్రేక్షకులు భారీగా హాజరయ్యారు. అయితే వీరికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ తెలిపారు. ఈ పోటీలను చూసేందుకు వచ్చేవారికోసం రేసింగ్‌ ట్రాక్‌ పొడవునా 7వేల నుంచి 8వేల వరకు ప్రేక్షకులు వీక్షించేందుకు సీటింగ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే వీక్షకుల కోసం బుక్‌మై షోలో టికెట్లు అందుబాటులో ఉంచారు. ట్రాక్‌లపై కార్లు 240కి.మీ పైగా వేగంతో దూసుకెళ్తుండటంతో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతున్నారు. దీంతో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ తదితర విభాగాలు 2.8 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =