ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై నందమూరి బాలకృష్ణ ప్రకటన

Nandamuri Balakrishna's Statement on the Organization of NTR Centenary Celebrations, Balakrishna's Statement on the Organization of NTR Centenary Celebrations, NTR Centenary Celebrations, Nandamuri Balakrishna's Statement, Hero Nandamuri Balakrishna's Statement on the Organization of NTR Centenary Celebrations, Actor Nandamuri Balakrishna's Statement on the Organization of NTR Centenary Celebrations, MLA Nandamuri Balakrishna's Statement on the Organization of NTR Centenary Celebrations, Organization of NTR Centenary Celebrations, NTR Centenary Celebrations News, NTR Centenary Celebrations Latest News, NTR Centenary Celebrations Latest Updates, NTR Centenary Celebrations Updates, Mango News, Mango News Telugu,

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శత జయంతి ఉత్సవాల నిర్వహణపై ఆయన తనయుడు, ప్రముఖ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. “నందమూరి తారక రామునికి ఈ నెల 28వ తేదితో నూరవ ఏడు మొదలవుతుంది. ఆ రోజు నుంచి 2023 మే 28 వరకు, 365 రోజులపాటు శకపురుషుని శత జయంతి వేడుకలు నేల నలుచేరగులా జరుగనున్నాయని తెలియజేయడానికి గర్వపడుతున్నాను” అని బాలకృష్ణ పేర్కొన్నారు. మునుపెన్నడూ కనీవినీ ఎరుగని విధంగా ఎన్నో దేశాలలో జరుగుతున్న ఈ వేడుకలకు నందమూరి కుటుంబం హాజరవుతుంది, ఆనందంలో పాలుపంచుకుంటుందని తెలిపారు.

నందమూరి కుటుంబం నుంచి నెలకొక్కరు, నెలకో కార్యక్రమంలో భాగస్వాములవుతారని చెప్పారు. అందులో భాగంగా మే 28వ తేదీ ఉదయం తమ స్వస్థలమైన నిమ్మకూరు వెళ్ళి అక్కడి వేడుకలలో తాను పాల్గొంటానని బాలకృష్ణ తెలిపారు. అనంతరం కళల కాణాచిగా ఖ్యాతిగాంచిన తెనాలి చేరుకుని, అక్కడ జరిగే శతాబ్ది వేడుకలను కూడా తన చేతుల మీదుగా ప్రారంభిస్తానని చెప్పారు. 365 రోజులు పాటుగా వారానికి 5 సినిమాలు, వారానికి 2 సదస్సులు, నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ఈ మహత్కార్యాన్ని తెనాలిలోని పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్ లో ప్రారంభించనున్నట్టుగా నందమూరి బాలకృష్ణ ప్రకటనలో వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here