తెలంగాణకు మరో పెట్టుబడి, రూ.700 కోట్లతో ఐఐఎల్ యానిమల్ వ్యాక్సిన్ తయారీ కేంద్రం ఏర్పాటు

Indian Immunologicals Ltd Announces to Invest Rs 700 Cr to set up New Animal Vaccine Manufacturing Facility in Telangana, Indian Immunologicals Ltd, IIL To Invest Rs 700 Cr Animal Vaccine Facility, TS Animal Vaccine Manufacturing Facility By IIL, IIL To Invest Rs 700 Cr On Animal Vax Facility, Hyderabad Bags Rs 700 Crore Animal Vaccine Facility, Indian Immunologicals To Invest Rs 700 Cr, IANS on Twitter, Indian Immunologicals, Indian Immunologicals Ltd, Indian Immunologicals Ltd Latest News And Updates, TS IIL Animal Vaccine Facility

తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకోస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు మరో పెట్టుబడి వచ్చి చేరింది. ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో కొత్త జంతు వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సుమారు 700 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. సోమవారం ఐఐఎల్ ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ బృందం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను కలుసుకుని కంపెనీ ప్రణాళికలను వివరించింది. ఐఐఎల్ ఏర్పాటు చేసే కొత్త జంతు వ్యాక్సిన్ తయారీ కేంద్రం ద్వారా మొత్తం 750 మందికి ఉపాధి లభించనుంది.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్‌ను ఇప్పటికే ప్రపంచ వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా పరిగణిస్తున్నామని అన్నారు. ఐఐఎల్‌ విస్తరణ వల్ల మానవులకే కాకుండా జంతువులకు కూడా ప్రపంచ ఆరోగ్య పరంగా మరింత పురోగతి ఉంటుందన్నారు. ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ ను కలిసిన వారిలో ఐఐఎల్ ఎండీ డాక్టర్ కె.ఆనంద్ కుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ముకుల్ గౌర్, ఎన్ఎస్ఎన్ భార్గవ్, ఐఐఎల్ బృందంలోని ఇతర సభ్యులు ఉన్నారు. అలాగే ఈ సమావేశంలో మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, రాష్ట్ర పరిశ్రమలు అండ్ వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జయేష్ రంజన్, లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + seven =