తెలంగాణలో పశు సంవర్థక శాఖ నిర్వహిస్తున్న 1962 సంచార పశువైద్యశాలల సేవలు అమోఘం

#Karnataka, Animal Husbandry Minister Prabhu B.Chauhan, Karnataka Animal Husbandry Minister, Karnataka Animal Husbandry Minister Meets Minister Talasani, Karnataka Animal Husbandry Minister Prabhu B.Chauhan, Karnataka Animal Husbandry Minister Prabhu B.Chauhan Meets Minister Talasani Srinivas, Karnataka Animal Husbandry Minister Prabhu B.Chauhan Meets Minister Talasani Srinivas Today, Karnataka Minister lauds Telangana’s mobile veterinary clinics, Mango News, Minister Talasani Srinivas, Minister Talasani Srinivas Yadav, Prabhu B.Chauhan, Prabhu B.Chauhan Meets Minister Talasani Srinivas

తెలంగాణ రాష్ట్రంలో పశు సంవర్థక శాఖ నిర్వహిస్తున్న 1962 సంచార పశువైద్యశాలల సేవలు అమోఘంగా ఉన్నాయని కర్నాటక రాష్ట్ర పశు సంవర్థకశాఖ మంత్రి ప్రభు బి.చౌహాన్‌ కొనియాడారు. కర్నాటక రాష్ట్రంలో నూతనంగా 1962 తరహాలు సంచార పశువైద్యశాలలను ప్రారంభించే తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న 1962 సేవల అమలు తదితర కార్యక్రమాలను పరిశీలించేందుకు ఒక్కరోజు పర్యటనలో భాగంగా ఈరోజు బుధవారం ఆయన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. మొదటగా మేడ్చల్‌ లోని సంచార పశువైద్యశాల కాల్‌ సెంటర్‌ ను సందర్శించి అక్కడ జరుగుతున్న విదివిధానాలను అడిగి తెలుసుకొన్నారు. కాల్‌ సెంటర్‌ కు సమాచారం వచ్చే విధానాన్ని, అక్కడి నుంచి సంబంధిత ప్రాంత సంచార పశువైద్య వాహనానికి సమాచారం చేరవేత, అక్కడి నుంచి ఎంత సేపట్లో సంచార పశు వైద్యశాల వాహనం సమస్య ప్రాంతానికి చేరుకుంటుంది అనే దానిపై ఆయన పూర్తి వివరాలను అడిగి తెలుసుకొన్నారు. కాల్‌ సెంటర్‌ లో ఉన్నటువంటి సంచార పశువైద్యశాల వాహనాన్ని పరిశీలించి, సంబంధిత సిబ్బందితో వైద్యసేవల అమలుపై కూలంకుశంగా చర్చించారు.

అనంతరం పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ను కలిసి ఆయా శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ కార్యాక్రమాల గురించి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆయనకు వివరించారు. భారత దేశంలో ఎక్కడలేని విధంగా సంచార పశువైద్యశాలలను మొట్టమొదటి సారి సెప్టెంబర్‌, 2017 సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 100 సంచార పశువైద్యశాలల ద్వారా రైతు ముంగిట మెరుగైన పశువైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలివారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమము ద్వారా 22,39,872 పశువులకు చికిత్స అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తూ అన్ని రాష్ట్రాలలో ఈ తరహాలోనే సంచార పశువైద్యశాలను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తుందని తెలిపారు. తెలంగాణ (ప్రభుత్వం కూడా అదనంగా 100 సంచార పశు వైద్యశాలలను నెలకొల్పుటకు రూ.352.00 కోట్టతో తగిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 2221 పశు వైద్యశాలలు రాష్ట్ర, జిల్లా, మండల మరియు గ్రామ స్థాయిలలో పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 326.39 లక్షల పశు సంపద మరియు 800 లక్షల కోళ్ళ సంపద ఉన్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో పాల ఉత్పత్తి 2020-21 నాటికి 57.65 లక్షల మెట్రిక్‌ టన్నులు, మాంసం ఉత్పత్తి 9.20 లక్షల మెట్రిక్‌ టన్నులు మరియు గుడ్ల ఉత్పత్తి 158650 లక్షలు ఉన్నట్లు తెలివారు. ఇట్టి ఉత్పత్తులను 2025-26 నాటికి పాల ఉత్పత్తిని 75.70 లక్షల మెట్రిక్‌ టన్నులు, మాంసం ఉత్పత్తి 13.66 లక్షల మెట్రిక్‌ టన్నులు మరియు గుడ్ల ఉత్పత్తి 215260 లక్షల ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న గొర్రెల పంపణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వివరిస్తూ, మొదటి విడతలో 80.80 లక్షల గొర్రెలను 3,84,806 మంది లబ్దిదారులకు 75 శాతం సబ్సిడీపై (20+1) యూనిట్‌ విలవతో పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. రెండవ విడత కార్యక్రమంలో 3.5 లక్షల మంది లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గొపాలమిత్రుల సేవలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇస్తున్న పారితోషకాన్ని 3,500/- నుండి 8,500/-లకు పెంచినట్లు తెలిపారు. అట్లాగే రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న గణీకృత వీర్యనాలికల ఉత్పత్తి కేంద్రం, కరీంనగర్‌ తోపాటు నూతనంగా కంసాన్‌ పల్లి నిర్మిస్తున్న గణీకృత వీర్యనాలికల ఉత్పత్తి కేంద్రం గురించి వివరించారు. వీటితో పాటు గోకుల్‌ గ్రామ్‌, సెక్స్‌ సార్టెడ్‌ సెమెన్‌ తదితర కార్యక్రమాల గురించి వివరించారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర పొడి పరిశ్రమాఖభీవృద్ధి సహకార సమాఖ్య ద్వారా అమలు చేయబడే కార్యక్రమాలను మంత్రి వివరిస్తూ, సహకార రంగంలో పాల సేకరణ రాష్ట్ర విభజన తరువాత గణనీయంగా పెరిగిందని తెలిపారు. నూతన రాష్ట్రఏర్చాటుకు ముందు పాల సేకరణ రోజుకు 1.27 లక్షల లీటర్ల నుండి 2020-21 సంవత్సరానికి గాను 2.50 లక్షల లీటర్లతో 77.16 శాతం వృద్ధిని సాధించిందని, పాడిరైతులకు ప్రోత్సహిస్తూ పాలసేకరణను పెంచే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం 2014 నుండి సహకార డెయిరీలైన విజయ డెయిరీ, ముల్కనూరు మహిళా డెయిరీ, కరీంనగర్‌ మరియు నర్మూల్‌ డెయిరీలకు పాలు పోసే పాడి రైతుల లీటరు పాలకు రూ.4/- ప్రోత్సాహకం అందించడం జరుగుతుందని తెలిపారు. తద్వారా రైతులు పాడి పరిశ్రమ వైపు ఎక్కువ మక్కువ చూపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 2.93 లక్షల పాడిరైతులకు లబ్టిచేకూరుతుందని అన్నారు.

తెలంగాణ మత్స్య పరిశ్రమ గురించి వివరిస్తూ రాష్ట్రంలో 29,303 వివిధ రకాల నీటి వనరులు ఉండగా వీటిలో 100 ఎకరాల పైబడి ఆయకట్టు గల చెరువులు 4647, నీటి విస్తీర్ణం 3,04,160 హెక్టార్లు, 100 ఎకరాల లోబడి ఆయకట్టు గల చెరువులు 24,574, నీటి విస్తీర్ణం 2,69,293 హెక్టార్లు మరియు 82 జలాశయాలు నీటి విస్తీర్ణం 2,02,136 హెక్టార్లు కలవని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే అత్యధికంగా 4,803 మత్స్య సహకార సంఘాలు 3,53,955 మంది సభ్యులతో రిజిస్టర్‌ కాబడి ఉన్నాయని, వీటిలో మత్స్య సహకార సంఘాలు 40486, సభ్యత్వం-3,05,224, మహళా మత్స్య సహకార సంఘాలు 655, సభ్యత్వం-34,308, మార్కెటింగ్‌ సహకార సంఘాలు-10, సభ్యత్వం 6013, లైసెన్స్‌ దారుల సహకార సంఘాలు-92, సభ్యత్వం 8,410, జిల్లా మత్స్య సహకార సంఘాలు-10 వీటిలో 2,036 ప్రాథమిక సహకార సంఘాల సభ్యత్వం కలవని వివరించారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి 2016-17 సంవత్సరంలో 1.93 లక్షల టన్నుల చేపలు మరియు 5,189 టన్నులు రొయ్యల ఉత్పత్తి ఉండగా, 2020-21 సంవత్సరంలో చేపలు 3.37 లక్షల టన్నులు, రొయ్యలు 11,734 టన్నులు వీటి విలువ రూ.5,229.20 కోట్లు చేరిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వివరించారు. 2014-15 సంవత్సరంలో 382 నీటి వనరులలో రూ.389.75 లక్షల వ్యయంతో 4.09 కోట్ల ఉచితంగా చేప పిల్లలు, 2015-16 సంవత్సరంలో 599 నీటి వనరులలో రూ.778.20 లక్షల వ్యయంతో 5.27 కోట్ల చేప పిల్లలు, 2016-17 సంవత్సరంలో 3939 నీటి వనరులలో రూ.2284.37 లక్షల వ్యయంతో 27.85 కోట్ల చేప పిల్లలు, 2017-18 సంవత్సరంలో 10,913 నీటి వనరులలో రూ.4224.35 లక్షల వ్యయంతో 50.78 కోట్ల చేప పిల్లలు, 2018-19 సంవత్సరంలో 10.786 నీటి వనరులలో రూ.4218.54 లక్షల వ్యయంతో 49.15 కోట్ల చేప పిల్లలు, 2019-20 సంవత్సరంలో 15,418 నీటి వనరులలో రూ.4643.81 లక్షల వ్యయంతో 862.12 కోట్ల చేప పిల్లలు, 2020-21 సంవత్సరంలో 18,335 నీటి వనరులలో రూ.5201.00 లక్షల వ్యయంతో 68.52 కోట్ల చేప పిల్లలు 100 శాతం రాయితీపై విడుదల చేయడం జరిగిందని, 2021-22 సంవత్సరానికి 28,704 అనువైన నీటి వనరులలో 93.19 కోట్ల చేప పిల్లలు 89.09 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కర్నాటక పశుసంవర్థకశాఖ మంత్రి ప్రభు బి.చౌహాన్‌, కమీషనర్‌ పశు సంవర్థకశాఖ బసవ రాజేంద్ర, పశుసంవర్థకశాఖ డైరెక్టర్‌ డా మంజునాధ, టీఎస్ఎల్డిఏ సీఈఓ డా.మంజువాణి, మత్స్యశాఖ కమీషన్‌ లచ్చిరాం భూక్యా, షిప్‌ ఫెడరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా. ఎస్.రాం చందర్‌ తధితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నాటక పశుసంవర్థక శాఖా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంచార పశువైద్యశాలల పని విధానాన్ని కొనియాడారు. కర్నాటక రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజక వర్గానికి ఒక సంచార పశువైద్యశాల మంజూరైట్లు తెలిపారు. కర్నాటక రాష్ట్రంలో పశుసేవలు అందించుటకై ప్రాణి సహాయక కేంద్రాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర తరహాలోనే పాడి రైతులకు లీటరు పాలకు ప్రోత్సహక రుసుం అందిస్తున్నట్లు తెలిపారు. గోశాలల నిర్వహణ కొరకు ప్రభుత్వం ఆర్థికసహాయం అందిస్తున్నట్లు తెలివారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఆద్వర్యంలో ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తున్నట్లు తెలిపారు. పశు సంక్షేమ అభివృద్ధి కొరకు కర్నాటక ప్రభుత్వానికి తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 5 =