మరోసారి సూచించిన హరిరామ జోగయ్య

Hari rama jogaiah, Pawan kalyan, janasena, ap politics,YSRC,MLA Candidates,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,andhra pradesh,pawan kalyan latest updates, Mango News Telugu, Mango News
Hari rama jogaiah, Pawan kalyan, janasena, ap politics

ఏపీలో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది.  ప్రధానపార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. టీడీపీ, జనసేన కూటమిలో నిలబెట్టాల్సిన అభ్యర్ధులపైన చంద్రబాబు, పవన్ మధ్య తరచూ చర్చలు జరుగుతున్నాయి. అయితే  ఎప్పటికప్పుడు పవన్‌కు తన లెటర్స్‌తో సలహాలు ఇచ్చే మాజీ ఎంపీ హరిరామ జోగయ్య .. పోటీ చేయాల్సిన స్థానాలు, అభ్యర్థుల ఎంపికపై   జనసేన అధినేతకు మరో లేఖ రాసారు.

రాబోయే ఎన్నికల్లో 41 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేయాలని చెప్పిన హరిరామజోగయ్య.. ఆ స్థానాల్లో ఏ అభ్యర్థులను  నిలబెడితే మంచిదో కూడా సూచించారు. ఆ స్థానాలలో  టీడీపీతో  ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడొద్దని.. పొత్తులో భాగంగా ఆ స్థానాలను దక్కించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే  భీమవరంతో పాటు నర్సాపురం స్థానాల నుంచి పవన్‌ను పోటీ చేయాలని సూచించారు.

తిరుపతి నుంచి  జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబును పోటీ చేయిస్తే మంచిదని హరిరామ జోగయ్య సూచించారు. మొత్తంగా..6 పార్లమెంట్‌ స్థానాలతో పాటు 41 అసెంబ్లీ స్థానాలను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని హరి రామజోగయ్య లేఖ ద్వారా చెప్పారు. ఏపీ జనాభాలో 25 శాతం మందిగా ఉన్న ఆర్థికంగా బలవంతులైన కాపు, తెలగ,బలిజ,తూర్పు కాపులకు ఆ స్థానాలను కేటాయించాలని లేఖలో సూచించారు.

ఎన్నికల కోసం కొంతకాలంగా వరుసగా పవన్‌కు  లేఖలు రాస్తున్నారు జోగయ్య..కేవలం ఈ పది రోజుల్లోనే 4 లేఖలు రాశారు. ఫిబ్రవరి 5న రాసిన లేఖలో టీడీపీ- జనసేన మధ్య సీట్ల సర్దుబాటు అనేది జనాభా నిష్పత్తిలోనే జరుగుతోందా అని హరిరామ జోగయ్య ప్రశ్నించారు. ఏపీలో యాచించే స్ధాయి నుంచి శాసించే స్ధాయికి తాము రావాలని కాపు కులస్తులు ఆలోచిస్తున్నారని..పవన్‌  కూడా అదే విధంగా సీట్లను డిమాండ్‌ చేయాలని కోరారు.  ఏపీలో జిల్లాల వారీగా అసెంబ్లీ, పార్లమెంట్‌ సీట్ల కేటాయింపు ఎలా ఉండాలో తన లెటర్లో సూచిస్తున్న హరి రామజోగయ్య..మరోసారి తన సలహాలు అందించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గంలో  90 శాతం మంది ఓటర్లు ఉండటంతో ఆ జిల్లాలోనే  జనసేనకే ఎక్కువ సీట్లు కేటాయించాలని సూచించారు హరిరామ జోగయ్య. అలాగే జన సైనికుల బలం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలన్నీ  జనసేన పార్టీ దక్కించుకోవాలని చెప్పారు. ఒకవేళ ఆ సీట్లను జనసేన దక్కించుకోలేకపోతే మాత్రం జరిగే నష్టాన్ని తెలుగు దేశం పార్టీ అనుభవించాల్సి వస్తుందని  హరిరామజోగయ్య హెచ్చరించారు. అయితే టీడీపీ,జనసేన,బీజేపీ పొత్తుపై ఇంకా ఒక స్పష్టమైన ప్రకటన విడుదలవక ముందే జోగయ్య రాస్తున్న ఈ లెటర్లు..పొలిటికల్ సర్కిల్ లో  కలకలం రేపుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 19 =