త్వరలో మహబూబాబాద్‌ సమీకృత కలెక్టరేట్‌ భవనం మరియు మెడికల్‌ కాలేజీలను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు – మంత్రి ఎర్రబెల్లి

Minister Errabelli Dayakar Rao Held Awareness Meet Over Dalit Bandhu Scheme in Palakurthy Constituency Today, Awareness Meet Over Dalit Bandhu Scheme in Palakurthy Constituency Today, Minister Errabelli Dayakar Rao Held Awareness Meet, Palakurthy Constituency, Palakurthy Constituency Awareness Meet, Dalit Bandhu Scheme in Palakurthy Constituency, Dalit Bandhu Scheme Awareness Meet, Telangana Minister Errabelli Dayakar Rao, Errabelli Dayakar Rao, Dalit Bandhu Scheme News, Dalit Bandhu Scheme Latest News And Updates, Dalit Bandhu Scheme Live Updates, Mango News, Mango News Telugu

మహబూబాబాద్‌ సమీకృత కలెక్టరేట్‌ భవనం మరియు మెడికల్‌ కాలేజీలకు త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించనున్నామని తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాలలో వేర్వేరుగా నిర్వహించిన దళిత బంధు సమీక్ష కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. దళితులకు ఆర్ధిక స్వావలంబన కలిగించేందుకు సీఎం కేసీఆర్‌ ‘దళిత బంధు’ పథకం తీసుకొచ్చారని, అయితే దీని వలన అందరికీ దశలవారీగా ఆర్ధిక ప్రయోజనం అందుతుందని హామీ ఇచ్చారు. క్లస్టర్ల వారీగా విభజన చేసి, లాటరీ పద్దతిలో, అందుబాటులో ఉన్న వనరులను బట్టి లబ్దిదారులను ఎంపిక చేస్తున్నామని మంత్రి తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రధానంగా విద్య, వైద్యం, ఉద్యోగ ఉపాధి అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని, దీనిపై సీఎం కేసీఆర్‌ స్ఫష్టమైన ఆదేశాలిచ్చారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గంలో కొడకండ్లలో నిర్మితమవుతున్న మినీ టెక్స్ టైల్ పార్క్‌కు మంత్రి కేటీఆర్‌ త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారని, దీనిద్వారా ఎంతోమందికి ఉపాధి కలుగనుందని చెప్పారు. ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి’ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూల్స్‌కు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని, దీనికోసం రూ. 6వేల కోట్లు కేటాయించామని ఆయన వెల్లడించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్‌ మీడియానికి అప్‌గ్రేడ్‌ చేసే బృహత్తర కార్యక్రమం చేపట్టామని, బడుగు వర్గాల పిల్లల కోసం కొత్తగా గురుకుల పాఠశాలలు, కాలేజీలను ప్రారంభించామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + fifteen =