ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా

Commissioner of Cyberabad Police, Disha Case Investigation, Disha Rape And Murder Case, Hyderabad Encounter, Mango News Telugu, National Human Rights Commission, Political Updates 2019, Probe Hyderabad Encounter Case, Supreme Court To Appoint Retired SC Judge, Telangana Breaking News

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్‌) పై డిసెంబర్ 11, బుధవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఎన్‌కౌంటర్‌పై రిటైర్డు న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించే అంశాన్ని పరిశీస్తున్నామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డే పేర్కొన్నారు. ఢిల్లీ నుంచే సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి ఈ ఎన్‌కౌంటర్ కేసును పరిశీలిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు కోసం రిటైర్డు న్యాయమూర్తి పీవీ రెడ్డిని సంప్రదించగా, ఆయన నిరాకరించారని చెప్పారు. ఎన్‌కౌంటర్‌ దర్యాప్తుపై సలహాలు, సూచనలతో రావాలని తెలంగాణ ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టులో ఎన్‌కౌంటర్‌పై విచారణ కొనసాగుతున్న విషయాన్ని జస్టిస్ ఎస్ ఏ బాబ్డే ప్రస్తావించారు. అనంతరం ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదిస్తూ, తమ వాదనలు విన్న తర్వాతే ముందుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు. తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఆదేశాలు జారీ చేయొద్దని కోరారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పై విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =