ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా కోసం రక్షణ విమానాలు వినియోగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

covid-19 Medicine from the Sky, Defense Aircrafts for Oxygen Supply for the First Time in India, Mango News, Oxygen Supply, Oxygen Supply In Telangana, Oxygen Supply Through Defense Aircrafts, Telangana Govt Uses Defense Aircrafts for Oxygen Supply, Telangana Govt Uses Defense Aircrafts for Oxygen Supply for the First Time, Telangana Govt Uses Defense Aircrafts for Oxygen Supply for the First Time in India, Telangana Oxygen Supply

ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా కోసం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం రక్షణ విమానాల‌ను ఉప‌యోగిస్తోంది. 8 ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ల‌తో బేగంపేట విమానాశ్రయం నుంచి ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ కు రక్షణ విమానాలు వెళ్లాయి. అక్కడి నుంచి 14.5 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్‌ ను హైద‌రాబాద్‌కు తీసుకురానున్నాయి. “తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వాయుమార్గం ద్వారా ఎనిమిది ఆక్సిజన్ ట్యాంకర్లను ఒరిస్సా రాష్ట్రంలోని లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లకు రక్షణ విమానాల ద్వారా పంపడం జరిగింది. దీని వలన సమయం ఆదా కావడంతో పాటు రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను నివారించడానికి ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ ట్యాంకర్లను మొదటి సారిగా వాయుమార్గం ద్వారా లిప్ట్ చేయడం జరిగింది” అని పేర్కొన్నారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులు బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యక్షంగా పాల్గొని విమానాల ద్వారా ట్యాంకర్లను పంపే పక్రియను పర్యవేక్షించారు. వింగ్ కమాండర్ చైతన్య నిజ్హవాన్ ల ఆధ్వర్యంలో ఇండియన్ ఎయిర్ పోర్టుకు చెందిన రెండు C-17 ఎయిర్ క్రాప్ట్ లు వినియోగించారు. వాయుమార్గం ద్వారా ట్యాంకర్లను రవాణా చేయడం ద్వారా మూడు రోజుల సమయం ఆదా అవుతుందని, కోవిడ్-19 రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా ఉంటుందని తెలిపారు. రోడ్లు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, సర్పరాజ్ అహ్మద్, డా.ప్రీతిమీనా అహర్నిషలు పనిచేసి ఈ ప్రక్రియ విజయవంతంగా జరిగేలా కృషి చేశారని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − one =