ఢిల్లీలో కొత్త‌గా నిర్మిస్తున్న పార్ల‌మెంట్ భ‌వ‌నానికి డా. అంబేడ్కర్ పేరు పెట్టాలి – తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ తీర్మానం

Minister KTR Introduces Resolution in T-Assembly For New Parliament Building Should be Named After Dr Ambedkar, Ts Assembly To Pass Resolution, Minister KTR Introduces Resolution, New Parliament Building , Dr Ambedkar Named New Parliment, Mango News, Mango News Telugu, Telangna Assembly Sessions, Minister KTR T-Assembly Resolution, Minister KTR Latest News And Updates, Minister KTR, Telangna Assembly News And Live Updates

ఢిల్లీలో కొత్త‌గా నిర్మిస్తున్న పార్ల‌మెంట్ భ‌వ‌నానికి భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఆయన మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో కీలక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీకి ఏ మాత్రం తగ్గని మహానుభావుడు అంబేడ్కర్ అని, ఆయన పేరును నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి పెట్టడం సముచితంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వ‌ల్లే తెలంగాణ రాష్ట్రం వ‌చ్చింద‌ని, ఆయన త‌త్వాన్ని టీఆర్ఎస్ ఆచ‌ర‌ణ‌లో చూపింద‌ని తెలిపారు. ఒకవేళ తాను రాసిన రాజ్యాంగం దుర్వినియోగం అయితే, అందరికంటే ముందుగా తానే దాన్ని త‌గుల‌బెడుతాన‌ని చెప్పగలిగిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహానుభావుడని మంత్రి అన్నారు.

దేశంలో రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించాలంటే దానికంటే ముందు సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించాలని 1949లోనే అంబేడ్కర్ సూచించారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. భారత సమాజం లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ’తో వెలుగొందాలని భావించించిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్ అని, రాష్ట్ర శాసనసభ ఆమోదంతో సంబంధం లేకుండానే పార్లమెంటులో సాధారణ మెజారిటీతో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసేలా ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో పొందుపరిచిన అంబేడ్కర్ కు తెలంగాణ జాతి యావత్తు రుణపడి ఉంటుందని స్పష్టం చేశారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వ‌ల్లే తెలంగాణ రాష్ట్రం వ‌చ్చింద‌ని, ఆయన త‌త్వాన్ని టీఆర్ఎస్ ఆచ‌ర‌ణ‌లో చూపింద‌ని తెలిపారు. ఇంతటి మహోన్నత వ్యక్తికత్వం కలిగిన డా. అంబేడ్కర్ పేరుని టెంపుల్ ఆఫ్ డెమాక్ర‌సీకి పెట్టుకోవడం దేశానికే గర్వకారణమని మంత్రి కేటీఆర్ చెప్పారు.

అనంతరం దీనిపై కాంగ్రెస్ స‌భాప‌క్ష నేత భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏక‌గ్రీవంగా ఆమోదం తెలుపుతున్నామని, కేంద్రం తెలంగాణ శాసనసభ ఆమోదించిన ఈ తీర్మానంపై స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ నిర్మాణంలో స్వేచ్ఛ‌, స‌మాన‌త్వం, సోద‌ర‌భావం వంటివి మూలసూత్రాలని అంబేడ్కర్ ఎప్పుడో చెప్పారని, అయితే ప్రస్తుత కేంద్రప్రభుత్వం మాత్రం అమలులో వీటిని పాటించడం లేదని అన్నారు. ఎక్కడైనా, ఎవరైనా స్వేచ్ఛ‌గా మాట్లాడితే.. ఐటీ, దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. మరోవైపు ప్రజలను వర్గాలుగా విడదీస్తూ వారిలో ఒక‌రిపై ఒక‌రికి విద్వేషం కలిగేలా రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్ట‌లో డా. అంబేడ్కర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని భ‌ట్టి విక్ర‌మార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =