దానం అడ్డాలో పీజేఆర్‌ బిడ్డ హోరా హోరీ..

PJRS child is hora hori in daan adda,PJRS child is hora hori,hora hori in daan adda,khiratabad, telangana assembly elections, danam nagender reddy, vijaya reddy, brs , congress,Mango News,Mango News Telugu,khiratabad Latest News,khiratabad Latest Updates,Telangana elections Latest Updates,Telangana elections Live News,Telangana elections Latest News,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News
khiratabad, telangana assembly elections, danam nagender reddy, vijaya reddy, brs , congress

గ్రేటర్‌ హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. ఒకరేమో ఎత్తులకు పై ఎత్తు వేయగల సీనియర్‌ రాజకీయ నేత. మరొకరేమో డేరింగ్‌ అండ్‌ డేషింగ్‌ లేడీగా పేరుగాంచిన పీజేఆర్‌ బిడ్డ. ఆ ఇద్దరు కీలక ప్రాంతంపై పట్టు కోసం తలబడుతున్నారు. అభిమానులంతా ‘పీజేఆర్‌’ అని ప్రేమగా పిలుచుకునే పి.జనార్దన్‌రెడ్డి వంటి నేత ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఖైరతాబాద్‌. రాష్ట్రంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉండి.. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజల దృష్టిని ఆకర్షించే ఈ అసెంబ్లీ స్థానంలో మరోసారి ఆసక్తికర పోరుకు తెరలేచింది. చాలా కాలం తరువాత పీజేఆర్‌ కుటుంబం తిరిగి ఇక్కడి నుంచి బరిలోకి దిగుతుండడంతో అందరి దృష్టీ మళ్లీ ఖైరతాబాద్‌పై పడింది. పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి.. కాంగ్రెస్‌ టికెట్‌ను తీవ్ర పోటీలో దక్కించుకొని మరీ బరిలోకి దిగారు. బీఆర్‌ఎస్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో ఆమె తలపడుతున్నారు.

ఖైరతాబాద్‌ అంటేనే.. దివంగత నేత, మాజీ సీఎల్పీ నాయకుడు, హైదరాబాద్‌ రాజకీయాలను దశాబ్దాలపాటు శాసించిన పి.జనార్దన్‌రెడ్డి పేరు గుర్తుకు వస్తుంది. ఈ నియోజకవర్గంలో 1978 నుంచి ఐదుసార్లు ఎమ్యెల్యేగా గెలిచిన జనార్దన్‌రెడ్డి 2004లో గెలుపొందిన తరువాత ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో అప్పట్లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి పోటీ చేసి గెలిచారు. అనంతరం జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన ఖైరతాబాద్‌ నియోజకవర్గం 5 నియోజకవర్గాలుగా విడిపోయింది. వాటిలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాన్ని విష్ణు ఎంచుకున్నారు. గతంలో పీజేఆర్‌ శిష్యుడిగా పేరు పొంది ఆసి్‌ఫనగర్‌ నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచిన దానం నాగేందర్‌ 2009లో ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి ఈ నియోజకవర్గంలోని పీజేఆర్‌ అనుచరులు దానం  వెంటే నడుస్తున్నారు.

అయితే 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన దానం నాగేందర్‌.. ఆ తరువాత కొంత కాలానికి అధికార బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో మరోసారి బీఆర్‌ఎస్‌ తరఫున బరిలోకి దిగారు. ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి పనులను, బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్న కొత్త హామీలను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలతో స్నేహపూర్వక అనుబంధం కలిగి ఉండడం నాగేందర్‌కు కలిసివచ్చే అంశం. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం, ఎలాంటి పరిస్థితులనైనా తనకు అనుకూలంగా మార్చుకునే సత్తా కలిగిన నాయకుడిగా దానంకు గుర్తింపు ఉంది. ఏ పార్టీలో తనకు వ్యతిరేకంగా ఉన్న చాలా మందిని ఇప్పటికే ప్రసన్నం చేసుకుని తన దారికి తెచ్చుకోవడం కూడా ఆయన సానుకూలాంశంగా చెబుతున్నారు.

మరోవైపు పీజేఆర్‌ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన బిడ్డ విజయారెడ్డి ఖైరతాబాద్‌ ప్రజలతో మమేకం అయ్యారు. ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. తండ్రిలాగే ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా స్పందిస్తూ.. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ లేడీగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఉండడం కూడా ఆమెకు కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు. 2014లోనే ఆమె వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా నిలబిడ్డారు. ఆ ఎన్నికల్లో ఆమెకు ఓటమి ఎదురు కావడంతో.. అనంతరం బీఆర్‌ఎ్‌సలో చేరి ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌గా పోటీ చేశారు. వరుసగా రెండుసార్లు ఆ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. అదే పార్టీ నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్‌తో కలిసి పనిచేశారు. కానీ, ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న లక్ష్యం బీఆర్‌ఎస్‌లో నెరవేరే అవకాశం కనిపించకపోవడంతో ఆ పార్టీని వీడారు. కాంగ్రెస్‌లో చేరి.. టికెట్‌ దక్కించుకున్నారు. అయితే ఇదే సమయంలో ఆమె సోదరుడు విష్ణు.. కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌ శిబిరంలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు జూబ్లీహిల్స్‌ టికెట్‌ నిరాకరించడంతో పార్టీ మారారు. తన సోదరి పోటీ చేస్తున్న ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నాగేందర్‌కు మద్దతుగా విష్ణు ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులతోపాటు సొంత తమ్ముడిని కూడా ఢీకొనాల్సిన పరిస్ధితిని విజయారెడ్డి ఎదుర్కొంటున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్య జరుగుతున్న పోరులో తాము తమ అనుకూల ఓట్లతో విజయం సాధిస్తామని బీజేపీ కూడా ధీమాతో ఉంది. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 19 =