ఈ నియోజకవర్గాలే అధికారాన్ని డిసైడ్ చేస్తాయ్..

These constituencies will decide the power,These constituencies will decide,Decide the power,constituencies decide,Mango News,Mango News Telugu,Telangana Elections 2023,Constituencies, kingmakers,votes,Telangana Assembly Elections 2023,assembly seat, BJP,BRS, Congress,Telangana elections Latest Updates,Telangana elections Live News,Telangana elections Latest News,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News
Telangana Elections 2023,Constituencies, kingmakers,votes,Telangana Assembly Elections 2023,assembly seat, BJP,BRS, Congress,

తెలంగాణలో మరికొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల కోసం.. నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇప్పటికే అభ్యర్థులు పోటాపోటీగా ఖర్చు చేసి తమ ప్రచారాలతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. రోడ్ షోలు, సభలు,  ఇంటింటికి వెళ్లి జనాలను కలవడం, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇలా అన్ని మార్గాల్లోనూ తమ ప్రచారాన్ని దాదాపు పూర్తి చేశారు.

మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన పోటీ అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్యనే ఉందని  ఇప్పటికే చాలా  సర్వేలు చెప్పేశాయి. బీఆర్ఎస్ అగ్రనేతలంతా కూడా  కేవలం కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించే విమర్శలు చేస్తుండగా.. రేవంత్ రెడ్డి వంటి ముఖ్య నేతలు బీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు.

ఇటు పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో.. తెలంగాణలో అధికారంలోకి ఎవరు వస్తారు? బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టి మూడవసారి అధికారంలోకి వస్తుందా లేక కాంగ్రెస్ తొలిసారి తెలంగాణలో అధికారాన్ని దక్కించుకుంటుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీంతో   తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలు కీలకంగా ఉంటాయని.. ఇవే ఈ నేతలకు అదృష్టాన్ని ఇస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ స్థానాల్లో గెలిచిన పార్టీనే.. అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ నియోజకవర్గాలలో ఇప్పుడు త్రిముఖ పోటీ జరుగుతుందని అంటున్నారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కరీంనగర్‌,కోరుట్ల, హుజూరాబాద్‌,  వేములవాడ, మానకొండూరు నియోజకవర్గాలు.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సిర్పూర్‌,  ముథోల్‌, నిర్మల్‌, బోధ్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాలు.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కామారెడ్డి, నిజామాబాద్‌(అర్బన్‌), ఆర్మూరు, జుక్కల్‌ నియోజకవర్గాలు.  ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మహబూబాబాద్‌, వరంగల్‌(ఈస్ట్‌), పరకాల, ములుగు నియోజకవర్గాలు.. హైదరాబాద్ దగ్గరలోని రంగారెడ్డి జిల్లాలో ఎల్బీనగర్‌, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, మహేశ్వరం, చేవెళ్ల, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాలు ఉన్నాయి.

అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కల్వకుర్తి, మహబూబ్‌నగర్‌, మక్తల్‌. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పఠాన్‌చెరువు,  దుబ్బాక, నర్సాపూర్‌ నియోజకవర్గాలు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేట, మునుగోడు నియోజకవర్గాలు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో జూబ్లీ హిల్స్‌, గోషా మహల్‌,ముషీరాబాద్‌,  అంబర్‌పేట్‌,  మల్కాజ్‌ గిరి నియోజకవర్గాలలో త్రిముఖ పోరు ఉంది. ఈ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు కూడా బలమైన పోటీ ఇస్తున్నారు.

మరోవైపు ఇక్కడ పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థుల్లో చాలామంది.. ఒకప్పుడు బీఆర్ఎస్‌ పార్టీలో ఉన్నవారే. అంతేకాదు వాళ్లంతా అందులో పదవులు అనుభవించినవారే. మారిన రాజకీయ పరిణామాల వల్ల వారంతా కాషాయ కండువా కప్పుకుని  కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు.  వీరందరికీ స్థానికంగా జనాల్లో  విపరీతమైన ఫాలోయింగ్ ఉండటంతో గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు.అలాగే కొన్ని నియోజకవర్గాలలో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎదురుగాలి వీస్తోండంతో.. ఇది తమకు లాభిస్తుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =