తెలంగాణలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు హాల్​టికెట్లు విడుదల, నేటి నుంచే డౌన్‌లోడ్‌

Preliminary Written Test of Constable Posts in Telangana Hall Tickets Download Started from Today, Preliminary Written Test of Constable Hall Tickets Download Started from Today, Hall Tickets Download Started from Today, Preliminary Written Test of Constable, Telangana Preliminary Written Test of Constable, Constable Preliminary Written Test, Preliminary Written Test, TS 2022 Police Constable Hall Ticket Download, preliminary written exam, Constable Preliminary Written Test News, Constable Preliminary Written Test Latest News And Updates, Constable Preliminary Written Test Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల‌కు సంబంధించి కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ రాత పరీక్ష ఆగస్టు 28వ తేదీన నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు నేటి నుంచే (ఆగస్టు 18, గురువారం) హాల్‌టికెట్లు జారీచేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ముందుగా 15,644 పోలీస్ కానిస్టేబుల్, 63 ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్‌, 614 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఖాళీల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం టీఎస్‌ఎల్‌పీఆర్బీ నోటిఫికేషన్స్ జారీ చేసింది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా 6,61,196 మంది అభ్యర్థుల కోసం ఆగస్టు 28, 2022 (ఆదివారం) నాడు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని ఇతర పట్టణాలలో మరియు చుట్టుపక్కల కలిపి మొత్తం 1601 పరీక్షా కేంద్రాలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రిలిమినరీ రాత పరీక్షనిర్వహించనున్నారు.

తమ దరఖాస్తులను విజయవంతంగా అప్‌లోడ్ చేసిన అభ్యర్థులందరూ www.tslprb.in వెబ్‌సైట్‌లో వారి వివరాలను ఎంటర్ చేయడం ద్వారా ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్ టిక్కెట్‌లను ఆగస్టు 18 ఉదయం 8 గంటల నుండి ఆగస్టు 26 అర్ధరాత్రి 12 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోలేని అభ్యర్థులు [email protected]కు ఇ-మెయిల్ పంపవచ్చని లేదా 9393711110 లేదా 93910 05006 నెంబర్ల ద్వారా సంప్రదించాలని సూచించారు. హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, అభ్యర్థులు దాన్ని రెండు వైపులా A4 సైజు కాగితంపై ప్రింట్‌అవుట్‌ను తీసుకోవాలని చెప్పారు. తద్వారా హాల్ టికెట్ తో పాటు ముఖ్యమైన సూచనలు ఒకే షీట్ కాగితంపై అందుబాటులో ఉంటాయన్నారు.

ప్రింట్‌అవుట్‌ తీసుకున్న తర్వాత, అభ్యర్థులు తమ పాస్‌పోర్ట్ ఫోటోగ్రాఫ్‌ను తప్పనిసరిగా గమ్ ద్వారా (స్టేపుల్స్/పిన్‌లను ఉపయోగించవద్దు) హాల్ టికెట్‌లోని మొదటి పేజీలోని ఎడమ-దిగువ ప్రాంతంలో అందించిన నిర్దేశిత స్థలంలో తప్పనిసరిగా అతికించాలి. దరఖాస్తు ఫారంతో ఇంతకు ముందు అప్‌లోడ్ చేయబడిన వారియొక్క ఫోటో/డిజిటల్ కాపీనే హాల్ టికెట్‌ లో అతికించాలని సూచించారు. పైన వివరించిన విధంగా అతికించిన పాస్‌పోర్ట్ ఫోటో లేని హాల్ టికెట్ ప్రిలిమినరీ రాత పరీక్ష రోజున అంగీకరించబడదని మరియు సరైన హాల్ టికెట్లు లేకుండా పరీక్షా కేంద్రాలకు వచ్చిన అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు ప్రవేశం నిరాకరించబడుతుందని పేర్కొన్నారు. మరోవైపు అభ్యర్థులు తమ స్వంత ఆసక్తితో, హాల్ టికెట్ వెనుకవైపు ఇచ్చిన అన్ని సూచనలను జాగ్రత్తగా పరిశీలించాలని మరియు వాటిని ఖచ్చితంగా పాటించాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =