తెలంగాణ: ఎస్‌ఐ ఉద్యోగాలకు ఆగస్టు 7న ప్రిలిమ్స్‌ పరీక్ష, రేపటినుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు

TS Police Recruitment 2022 SI Written Exam To be Held on August 7 Hall Tickets Can Download From Tomorrow, SI Written Exam To be Held on August 7, SI Written Exam Hall Tickets Can Download From Tomorrow, Telangana SI Written Exam, SI Written Exam, TS Police Recruitment 2022, 2022 TS Police Recruitment, TS Police Recruitment, Telangana Police Recruitment 2022, SCT SI written exam admit card, Telangana State Level Police Recruitment Board, SI Police hall ticket, TS Police SI Hall Tickets 2022, TS Police Recruitment 2022 News, TS Police Recruitment 2022 Latest News, TS Police Recruitment 2022 Latest Updates, TS Police Recruitment 2022 Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ఉదోగార్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ముందుగా నిర్వహించనున్న ప్రిలిమ్స్‌ పరీక్షను ఆగస్టు 7న నిర్వహస్తామని పేర్కొంది. కాగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం 81 వేల పోస్టుల భర్తీని ప్రభుత్వం విడతల వారీగా చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్‌ 25న పోలీస్‌ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిలో భాగంగా ప్రిలిమ్స్‌ పరీక్షను ఆగస్టు 7వ తేదీన నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన హాల్‌టికెట్లు రేపు (జులై 30) ఉదయం 8 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ప్రకటించింది. ఆగస్టు 5వ తేదీ రాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తెలిపింది.

ఒకసారి ఆన్‌లైన్‌లో విడుదలైన తర్వాత, సంబంధిత అభ్యర్థులు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ అధికారిక వెబ్‌సైట్ tslprb.in నుండి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. ఈ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు వారి ఆధారాలను నమోదు చేయడం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోలేని అభ్యర్థులు [email protected]కు ఇ-మెయిల్ పంపవచ్చు, లేదా 93937 11110 లేదా 93910 05006లో సంప్రదించవచ్చని రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ వివరించింది. ఇక హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా 35 పట్టణాల్లో 503 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, వ్రాత పరీక్ష ఆగస్టు 7న (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించింది. కాగా ఈ పరీక్షకు దాదాపు 2,47,217 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =