హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షం

Rain Lashes Once Again in Hyderabad City

హైదరాబాద్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి ఇంకా కోలుకోకముందే, శనివారం సాయంత్రం పలు చోట్ల మళ్ళీ వర్షం పడింది. సాయంత్రం కురిసిన వర్షంతో నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు, ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. రామంతాపూర్, అంబర్ పేట, కాచిగూడ, విద్యానగర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో మోస్తరుగా వర్షం పడగా, దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలీపురం, ఎల్బీనగర్, హయత్ నగర్, కూకట్‌పల్లి, మెహదీపట్నం, మలక్‌పేట, నాగోల్, హబ్సీగూడ, రాయదుర్గం, షేక్‌పేట, మదీనా, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మరోవైపు వర్షాల వలన ప్రజలకు ఇబ్బంది కలగకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నీరు నిల్వ అయ్యే ప్రాంతాలకు పంపించినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 7 =