ఆడపిల్లల కనీస పెళ్లి వయస్సుపై త్వరలో నిర్ణయం, ప్రధాని మోదీ స్పష్టత

Call on minimum marriage age of girls soon, girls minimum age for marriage, Govt to soon decide on minimum age of marriage for girls, Govt to Soon Take Decision on Minimum Age of Marriage for Girls, Marriage age for girls, Minimum Age of Marriage for Girls, national news, PM Modi, pm narendra modi, Revising Minimum Age Of Marriage For Girls

దేశంలో అమ్మాయిల పెళ్లికి కనీస వయస్సుపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం నాడు స్పష్టం చేశారు. ఈ అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ నుండి నివేదిక అందుకున్న తరువాత అమ్మాయిల కనీస వివాహ వయస్సును సవరించడానికి త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) యొక్క 75 వ వార్షికోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 75 రూపాయల స్మారక నాణాన్ని విడుదల చేసిన సందర్భంగా ప్రసంగించిన సమయంలో ప్రధాని మోదీ ఈ అంశంపై స్పందించారు.

అమ్మాయిల వివాహానికి అనువైన వయస్సు ఏమిటో నిర్ణయించడానికి ఒక ముఖ్యమైన చర్చ జరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఈ అంశంపై ఏర్పాటైన కమిటీ నివేదిక గురించి, దానిపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో అడుగుతూ దేశవ్యాప్తంగా మహిళల నుంచి తనకు లేఖలు వస్తున్నాయని ప్రధాని చెప్పారు. కమిటీ నుంచి నివేదిక వచ్చిన వెంటనే ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటుందని మోదీ అన్నారు. మరోవైపు ప్రస్తుత నిబంధనల ప్రకారం వివాహం చేసుకునేందుకు అమ్మాయిలకు కనీస వయస్సు 18 సంవత్సరాలు గానూ మరియు అబ్బాయిలకు 21 సంవత్సరాలు గానూ ఉంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =