కాంగ్రెస్‌పై షర్మిల ఆశలు.. మరి రేవంత్ ఒప్పుకుంటారా?

కాంగ్రెస్‌పై షర్మిల ఆశలు.. మరి రేవంత్ ఒప్పుకుంటారా?
Ys Sharmila , Congress, YSR Telangana Party, Revanth Reddy ,No entry for Sharmila? , Sharmila's hopes on Congress,

కొన్ని నెలలుగా తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. రాజకీయ విశ్లేషకుల అంచనాలను సైతం తలకిందులు చేసే పరిస్థితులు ఎదురవుతున్నాయి. బీఆర్ఎస్‌కు  గట్టి పోటీ ఇస్తుంది తప్ప కాంగ్రెస్‌ గెలిచే  అవకాశమే  లేదన్న విశ్లేషకుల లెక్కలను కూడా తప్పు అని ప్రూవ్  చేస్తూ.. ఏకంగా  తెలంగాణ అధికారపార్టీగా కాంగ్రెస్ సెటిలయిపోయింది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత కుమ్ములాటలతో ఎప్పటికైనా రేవంత్ ప్రభుత్వానికి ప్రమాదమే అన్న వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. సీనియర్ల  విషయంలో రేవంత్ వ్యవహరించే తీరుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు  వైఎస్సార్టీపీ  అధ్యక్షురాలు షర్మిల తమ పార్టీలోకి రాకుండా అడ్డుకుందీ కూడా రేవంత్ రెడ్డినే. ఇలా ప్రతీ ఒక్కరితో రేవంత్‌కు పొసగడం లేదని.. ఇదే అతనికి మైనస్‌గా మారుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

నిజమే.. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ అప్పట్లో ఏపీ జనాల్లోకి దూసుకుపోయిన వైఎస్ షర్మిల..  జగన్ గెలుపునకు కారణమే అన్న విషయం తెలిసిందే. కానీ కుటుంబ కలహాలతో జగన్‌కు దూరంగా జరిగిన షర్మిల ఏపీలో కాకుండా తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీని కూడా స్థాపించారు. పాదయాత్ర చేసి తెలంగాణ వాసులకు దగ్గర అవడానికి ప్రయత్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ కూడా చేస్తానని ప్రకటించారు. కానీ మారిన రాజకీయ పరిణామాలతో వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తారు అన్న వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. కానీ విలీనం జరగలేదు.. షర్మిల పోటీ చేయలేదు.  కేవలం కాంగ్రెస్ పార్టీకి మద్దతు మాత్రమే ప్రకటించారు. అయితే దీని వెనుక రేవంత్ రెడ్డితో పాటు అతని వర్గం ఉందన్న ప్రచారం జరిగింది.

కేవలం రేవంత్ రెడ్డి వల్లే షర్మిల కాంగ్రెస్‌కు దూరం అయ్యారని.. అందుకే ఎంతగా ప్రయత్నించినా చివరకు ఢిల్లీ వరకూ వెళ్లినా కూడా షర్మిల అనుకున్నది సాధించలేకపోయారని వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో మరోసారి షర్మిల తెరమీదకు వచ్చారు.  కొత్తగా ఏర్పడిన రేవంత్ సారధ్యంలోని కాంగ్రెస్ గవర్నమెంటుకి షర్మిల మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.పదేళ్ల నియంత పాలన నిలువునా పాతి పెడుతూ.. సరికొత్త ఆశలతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతూ తెలంగాణ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఒక అద్భుతమంటూ షర్మిల ట్వీట్ చేశారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్‌కు అనుకూలంగా షర్మిల ప్రకటన కూడా చేశారు . వైఎస్సార్టీపీ తరఫున కాంగ్రెస్ సర్కారుకు ఎల్లవేళలా తమ సహకారం , మద్దతు ఉంటుందని ప్రకటించారు.

అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా.. కాంగ్రెస్‌తో సాన్నిహిత్యం పెంచుకోవడానికి మరోసారి షర్మిల ప్రయత్నిస్తుండటంతో.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె కీలక పదవిని ఆశిస్తున్నారా అన్న అనుమానాలు కాంగ్రెస్ వర్గీయుల్లో కలుగుతున్నాయట.  షర్మిల అనుకోవడం ఓకే కానీ.. షర్మిల కాంగ్రెస్‌కు దగ్గర అవడానికి సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముందు నుంచీ కూడా షర్మిలను, తన పార్టీని పక్కన పెట్టే విధంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు కేవలం తన  మార్క్ పాలనను మాత్రమే  చేయాలని చూస్తున్న సమయంలో షర్మిలను కాంగ్రెస్‌లోకి రానిస్తారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. షర్మిల ఎంత ప్రయత్నించినా వృధా ప్రయాస మాత్రమేనని..ఆమెను పార్టీలోకి రానివ్వడం,  ఆ  పార్టీ మద్దతు తీసుకోవడం రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితులలోనూ చేయరన్న వాదన వినిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − six =