నిరుద్యోగులకు శుభవార్త, సింగరేణిలో మార్చిలోగా 651 పోస్టుల భర్తీ

CMD Sridhar, Mango News Telugu, sccl cmd sridhar, SCCL to fill 651 posts by March, Singareni, Singareni Collieries Company Limited, Singareni Job Vacancies, Singareni Job Vacancies News, Singareni to recruit, Singareni to Recruit 651 Vacancies, Singareni to Recruit 651 Vacancies by the End of March, Singareni to recruit directly about 651 vacancies, Singareni Vacancies

సింగరేణి బొగ్గు ఉత్పత్తి పరిశ్రమలో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి భర్తీ చేయనున్నామని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ ప్రకటించారు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశం మేరకు సింగరేణి సంస్థలో ప్రస్తుతం ఉన్న 651 ఖాళీలను మార్చిలోగా భర్తీ చేయనున్నామని తెలిపారు. ఈ రిక్రూట్‌ మెంట్‌ ప్రక్రియ మొత్తం మార్చి 2021 నాటికి పూర్తి చేస్తామని, అన్ని పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి, ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని వివరించారు. 651 ఖాళీలలో 569 ఎన్‌.సి.డబ్ల్యు.ఎ పరిధిలోని కార్మిక ఉద్యోగాలు, 82 అధికార పోస్టులు ఉన్నాయని, ప్రత్యేక నోటిఫికేషన్ల ద్వారా వీటిని భర్తీ చేయనున్నామని తెలిపారు.

సింగరేణి సంస్థ చేపట్టనున్న అన్ని నియామకాలు అభ్యర్ధుల ప్రతిభ, రాత పరీక్షలో వారికి వచ్చే మార్కుల పైనే ఆధారపడి ఉంటాయనీ, కనుక పరీక్షలకు బాగా సంసిద్ధమవ్వాలని సూచించారు. ఇంటర్వ్యూ అనే ప్రక్రియ ఉండదనీ, కనుక ఎటువంటి పైరవీలకు అవకాశం ఉండబోదనీ, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా చేప్తే వారి మాటలకు మోసపోవద్దని సింగరేణి యాజమాన్యం హెచ్చరించింది.

సింగరేణి సంస్థ వివిధ విభాగాలలో 569 కార్మిక పోస్టుల ఖాళీల వివరాలు:

  • జూనియర్‌ అసిస్టెంటు (క్లర్కులు)-177 పోస్టులు
  • ఫిట్టర్లు-128
  • ఎలక్ట్రిషీయన్లు టైనీలు-51
  • వెల్డర్ ట్రైనీలు-54
  • టర్నర్‌/ మెషినిస్టు ట్రైనీలు-22
  • మోటర్‌ మెకానిక్‌ ట్రైనీలు-14
  • మౌల్డర్ ట్రైనీలు-19
  • జూనియర్‌ స్టాఫ్‌ నర్స్‌-84
  • ల్యాబ్‌ టెక్నిషీయన్లు-7
  • ఫార్మాసిస్టులు-5
  • ఎక్స్‌-రే, ఇ.సి.జి, వెంటిలేటర్‌ విభాగాల్లో – 6
  • ఫిజియోథెరపీ, వెంటిలేటర్‌ విభాగం – 2

82 అధికార పోస్టుల ఖాళీల వివరాలు:

  • మైనింగ్‌ విభాగంలో మేనేజిమెంటు ట్రైనీలు-39 పోస్టులు
  • పర్సనల్‌ ఆఫీసర్‌-17,
  • మేనేజిమెంటు ట్రైనీలు (ఇండస్ట్రీయల్‌ ఇంజనీరింగ్‌)-10,
  • సివిల్‌ శాఖలో మేనేజిమెంటు ట్రైనీలు-7,
  • మేనేజ్ మెంట్ ట్రైనీలు (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)-6,
  • జూనియర్‌ అటవీ అధికారి-3
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 5 =