ఐఎఫ్‌ఎస్సీ కోడ్ మార్పులపై ఆందోళన వద్దు, జూన్ 15 నుండి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు

Agriculture Minister Niranjan Reddy, CM KCR Review On Rythu Bandhu Scheme, Mango News, Niranjan Reddy About Rythu Bandhu Scheme Money Distribution, Rythu Bandhu Scheme, Rythu Bandhu Scheme Money, Rythu Bandhu Scheme Money Distribution, Rythu Bandhu Scheme News, Rythu Bandhu Scheme Status, telangana agriculture minister, Telangana Agriculture Minister Niranjan Reddy About Rythu Bandhu Scheme Money Distribution, Telangana Agriculture Minister Niranjan Reddy Rythu Bandhu Scheme Money Distribution

రాష్ట్రంలో జూన్ 15 నుంచి 25వ తేదీ లోపల రైతుబంధు పంటసాయం కింద ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 15 నుండి రైతుబంధు నిధుల పంపిణీపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. పలు బ్యాంకుల విలీనంతో ఐఎఫ్‌ఎస్సీ కోడ్ లు మారినప్పటికీ కూడా రైతుల ఖాతాలలోకి కూడా నిధులు జమచేయబడతాయని పేర్కొన్నారు.

జూన్ 10 లోపు మొదటిసారి పట్టాదారు పాసుబుక్కులు పొందిన రైతుల బ్యాంకు ఖాతా వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈఓ) ద్వారా సేకరించబడతాయని చెప్పారు. ఇందుకోసం కోసం రైతులు స్థానికంగా ఏఈఓలను సంప్రదించాలని అన్నారు. బ్యాంకు ఖాతా నంబర్, పట్టాదారు పాసుబుక్కు, ఆధార్ కార్డు వివరాలు రైతులు ఏఈఓలకు అందజేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. రైతుబంధు నిధుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన, ఆపోహాలకు గురిచెందాల్సిన అవసరం లేదన్నారు. ఐఎఫ్‌ఎస్సీ కోడ్ మార్పుల విషయంలో కూడా రైతులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు. రైతుబంధు నిధుల జమకు సంబంధించి జూన్ 10 వరకు పట్టాదార్ పాస్ బుక్కులు పొంది సీసీఎల్ఏ ద్వారా ధరణి పోర్టల్ లో చేర్చబడిన అర్హులైన రైతులు అందరికీ రైతుబంధు నిధులు జమవవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =