తెలంగాణ ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించడానికే ప్రజా సంగ్రామ యాత్ర: బండి సంజయ్

Bandi Sanjay Kumar Set To Begin Praja Sangrama Padayatra, Bandi Sanjay Praja Sangrama Yatra, Bandi’s padayatra, Bandi’s padayatra to begin today, Mango News, Praja Sangrama Yatra, Praja Sangrama Yatra in Telangana, Praja Sangrama Yatra News, Telangana BJP President, Telangana BJP President Bandi Sanjay, Telangana BJP President Bandi Sanjay Kumar, Telangana BJP President Bandi Sanjay Kumar Set To Begin Praja Sangrama Padayatra Today, Telangana BJP President Bandi Sanjay Praja Sangrama Yatra

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శనివారం ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో చేపడుతున్న తన పాదయాత్రను ప్రారంభించారు. శనివారం ఉదయం ముందుగా హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చార్మినార్‌ వద్ద ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ మార్పుకు తన పాదయాత్ర వేదిక కాబోతుందన్నారు. తెలంగాణ ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించడానికే ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నట్టు తెలిపారు. ఈ పాదయాత్ర ప్రారంభోత్సవ సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్, డీకే అరుణ, లక్ష్మణ్‌, మురళీధర్‌రావు, విజయశాంతి సహా పలువురు రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొన్నారు.

మరోవైపు రాష్ట్రంలో బండి సంజయ్ మొదటివిడత పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. తొలివిడతలో రోజుకు 10 కిలో మీటర్ల చొప్పన మొత్తం 34 రోజుల పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్ర హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వరకు కొనసాగించనుంది. ఇక తొలిరోజు బండి సంజయ్ పాదయాత్ర పూర్తిగా హైద్రాబాద్ నగరంలోనే జరగనుంది. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద మొదలై మదీనా, ఆఫ్జల్ గంజ్, బేగంబజార్, మెజంజాహీ మార్కెట్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్ మీదుగా మెహిదీపట్నం వరకు కొనసాగనుంది. తొలిరోజు పాదయాత్ర ముగిసాక రాత్రికి మెహిదీపట్నం పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో బండి సంజయ్ బస చేయనున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 4 =