సీఎం కేసీఆర్ కు మద్ధతు తెలిపిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, ఫిబ్రవరి 20న ముంబయికి సీఎం కేసీఆర్

Telangana CM KCR to Meet Maharashtra CM Uddhav Thackeray on February 20

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 20వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో బేటీ కానున్నారు. బుధవారం ఉదయం సీఎం కేసీఆర్ కు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఫోన్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఫెడరల్ న్యాయం కోసం, దేశం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి ఉద్ధవ్ థాకరే సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టు తెలిపారు. అలాగే ముంబయికి రావాలని, తన ఆతిధ్యాన్ని అందుకోవాలని సీఎం ఉద్ధవ్ థాకరే సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 20న సీఎం కేసీఆర్ ముంబయి బయలుదేరి వెళ్లనున్నారు

ఈ సందర్భంగా సీఎం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, “కేసీఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం.” అంటూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. “మిమ్మల్ని ముంబయికి ఆహ్వానిస్తున్నాను. మీరు మా ఆతిథ్యాన్ని తీసుకోండి. అదే సందర్భంలో ఈ దిశగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందాం.” అని సీఎం కేసీఆర్ ను ఉద్ధవ్ థాకరే ఆహ్వానించినట్టు తెలిపారు. ఈ భేటీ సందర్భంగా దేశంలో ప్రస్తుతం నెలకున్న రాజకీయ పరిస్థితులు, బీజేపీపై పోరాటం, భవిష్యత్ కార్యచరణ సహా పలు అంశాలపై ఇరువురు సీఎంలు చర్చించే అవకాశమునట్టు తెలుస్తుంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − nine =