తెలంగాణలో ప‌ది యూనివ‌ర్సిటీల‌కు కొత్త వైస్ ఛాన్సలర్లు వీరే…

Telangana Govt Appointed Vice Chancellors for 10 Universities in the State

రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ (వీసీ) లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, యూజీసీ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ ల నియామక ప్రక్రియను చేపట్టి పేర్లను సూచించింది. కరోనా నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగినా, నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి గవర్నర్ ఆమోదం కోసం సిఫారసు చేయడం జరిగింది. శుక్రవారం నాడు రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజాన్ వీసీల నియామకానికి ఆమోదం తెలిపారు.

రాష్ట్రంలో పది యూనివర్సిటీలకు నియమితులైన వీసీల వివరాలు:

  1. ఉస్మానియా యూనివర్సిటీ, (హైదరాబాద్) వీసీ – ప్రొ.డి.రవీందర్ యాదవ్
  2. కాకతీయ యూనివర్సిటీ (వరంగల్) వీసీ – ప్రో.టి.రమేష్
  3. తెలంగాణ యూనివర్సిటీ, (నిజామాబాద్) వీసీ – ప్రో. డి. రవీందర్
  4. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (హైదరాబాద్) వీసీ – ప్రొ.సీతారామారావు
  5. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ (హైదరాబాద్) వీసీ – ప్రొ.టి.కిషన్ రావు
  6. పాలమూరు యూనివర్సిటీ (మహబూబ్ నగర్) వీసీ – ప్రొ. లక్ష్మీకాంత్ రాథోడ్
  7. మహాత్మాగాంధీ యూనివర్సిటీ, (నల్లగొండ) వీసీ – ప్రో.సిహెచ్.గోపాల్ రెడ్డి
  8. జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (హైదరాబాద్) వీసీ – ప్రొ.కట్టా నర్సింహా రెడ్డి
  9. శాతవాహన యూనివర్సిటీ, (కరీంనగర్) వీసీ – ప్రో.మల్లేశం
  10. జవహర్ లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (హైదరాబాద్) వీసీ – శ్రీమతి కవిత దర్యాని
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + nine =