తెలంగాణలో ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ ధరలు మరోసారి తగ్గింపు

Telangana Govt Once Again Reduced RT PCR Corona Testing Rates in Private Labs,Mango News,Mango News Telugu,The Price Of Corona Tests Is Once Again Reduced In Telangana,Telangana Latest News Updates,Telangana Latest News,Telangana,Telangana Govt,RT PCR Corona Testing Rates,RT PCR,RT PCR Corona Testing,RT PCR Corona Testing Rates in Private Labs,Telangana Govt Once Again Reduced RT PCR Corona Testing Rates,RT PCR Corona Testing Rates Reduced In Private Labs,RT PCR Corona Testing Rates Reduced In Telangana,RT PCR Corona Testing Price Reduced,Telangana Corona Testing Rates,Telangana Govt Once Again Reduced Corona Tests Rates,Corona Tests Rates In Telangana

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఐసీఎంఆర్‌, ఎన్‌ఏబీఎల్ అనుమతి ఇచ్చిన ప్రైవేట్ ల్యాబ్స్ లలో కరోనా పరీక్షలకు చెల్లించే ధరలను మరోసారి తగ్గిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు లాబ్స్/హాస్పిటల్స్ లో చేసే ఆర్టీపీసీఆర్‌ కరోనా పరీక్షల ధరను రూ.850 నుంచి రూ.500 కి తగ్గించారు. అలాగే ఇంటివద్దకే వచ్చి తీసుకునే శాంపిల్‌ పరీక్ష ధరను రూ.1,200 నుంచి రూ.750 కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా పరీక్షల కోసం ఉపయోగించే కిట్లు మార్కెట్ లోకి పెద్ద ఎత్తున అందుబాటులోకి రావటంతోనే ధరలు తగ్గింపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు కరోనా పరీక్షలు ఉచితంగానే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + five =