తెలంగాణ గురుకులాల్లో 5వ త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌, మే 8న ప్ర‌వేశ‌ప‌రీక్ష‌

Telangana VTG CET-2022 Notification Released Entrance Exam will be Held on May 8th, VTG CET-2022 Notification Released, Entrance Exam will be Held on May 8th, VTG CET-2022, 2022 VTG CET, Telangana, TGCET 5th Class Entrance Test, Entrance Test, Entrance Exam, VTG CET-2022 Notification, 2022 telangana gurukula Entrance Exam, telangana gurukula Entrance Exam 2022, Telangana VTG CET-2022, 2022 Telangana VTG CET, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే వీటీజీసెట్-2021 (తెలంగాణ గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నోటిఫికేష‌న్ బుధవారం నాడు విడుద‌లైంది. 2022-2023 విద్యా సంవత్సరానికి గానూ సోషల్, ట్రైబల్, బీసీ మరియు జనరల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం వీటీజీసెట్-2022 నిర్వహించనున్నారు. 2021-22 విద్యా సంవ‌త్స‌రంలో నాలుగో త‌ర‌గ‌తి చదువుతున్న విద్యార్థులు ఈ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌కు అర్హులని తెలిపారు. ఈ పరీక్ష కోసం మార్చి 9, 2022 నుంచి మార్ఛి 28, 2022 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫీజు కింద రూ.100 చెల్లించి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని తెలిపారు. ఇక వీటీజీసెట్-2022 ప్రవేశ పరీక్షను మే 8వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు వీటీజీసెట్ చీఫ్ కన్వీనర్ రోనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు.

“ప్రవేశాలకు సంబంధించి ఏవైనా ప్రశ్నల ఉంటే అభ్యర్థులు టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 45678 ను సంప్రదించవచ్చు. అభ్యర్థులు ప్రాస్పెక్టస్, అర్హత ప్రమాణాలు మరియు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ కోసం www.tswreis.in, http:/tgcet.cgg.gov.in, http:/mjptbcwreis.telangana.gov.in, http:/tgtwgurukulam.telangana.gov.in, http:/tresidential.gov.in వంటి వెబ్‌సైట్‌లను సందర్శించాలని సూచిస్తున్నాం” అని వీటీజీసెట్ చీఫ్ కన్వీనర్ రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + ten =