నేడు కామారెడ్డిలో బంద్‌కు పిలుపునిచ్చిన రైతులు.. మున్సిపాలిటీ మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు

Tension Prevails at Kamareddy During Farmers JAC Calls For District Bandh Today Against Municipality Master Plan,Tension Prevails at Kamareddy,Farmers JAC Calls For District Bandh,Municipality Master Plan,Mango News,Mango News Telugu,Minister KTR Responds,Over Farmers Protests,Kamareddy Master Plan,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కామారెడ్డి మున్సిపాల్టీ మాస్టర్ ప్లాన్‌ మంటలు జిల్లాలో మంటలు పుట్టిస్తోంది. ఏడాదికి రెండు పంటలు పండే భూముల్ని వదులుకునేది లేదంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా గురువారం దాదాపు 8 గ్రామాల నుంచి రైతులు భారీ సంఖ్యలో కలెక్టరేట్‌ ముట్టడికి ప్రయత్నించడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. అప్రమత్తమైన ఉన్నతాధికారులు భారీగా పోలీసులను మోహరించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఇంత జరిగినా దీనిపై చర్చించేందుకు కలెక్టర్ ముందుకు రాలేదంటూ ఆగ్రహించిన రైతులు శుక్రవారం కామారెడ్డి జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పట్టణంలో పలుచోట్ల రైతులు, రైతు సంఘాల నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక పట్టణంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కామారెడ్డి బంద్‌కు ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి కామారెడ్డి బంద్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ప్రకటించారు. ఈ బంద్‌కు కాంగ్రెస్ శ్రేణులు మద్దతు తెలపాలని, అలాగే బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం వల్లనే సమస్య జఠిలం అయ్యిందని, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేసి ప్రజా క్షేత్రంలో సభలు జరిపి రైతులతో చర్చించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఇక మరోవైపు బీజేపీ కూడా కామారెడ్డి బంద్‌కు సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు నిన్న జరిగిన ఆందోళనల్లో కూడా పాల్గొనడం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు కామారెడ్డికి వెళ్లి రైతులకు సంఘీభావం తెలుపనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 10 =