టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌పై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

TPCC Chief Revanth Reddy Reacts on TRS MLC Kavitha Counter Tweet of Rahul Gandhi, TRS MLC Kavitha Counter Tweet of Rahul Gandhi, TPCC Chief Revanth Reddy Reacts on TRS MLC Kavitha Counter Tweet of Rahul Gandhi Tweet on Paddy Procurement in Telangana, TPCC Chief Revanth Reddy, TPCC Chief, Revanth Reddy, Revanth Reddy Reacts on TRS MLC Kavitha Counter Tweet of Congress Leader Rahul Gandhi, TRS MLC Kavitha Responds Over Rahul Gandhi Tweet on Paddy Procurement in Telangana, MLC Kavitha Responds Over Rahul Gandhi Tweet on Paddy Procurement in Telangana, TRS MLC Kavitha, Rahul Gandhi Tweet on Paddy Procurement in Telangana, Rahul Gandhi Tweet on Paddy Procurement, TRS MP Kavitha, TRS MP Kavitha Responds Over Rahul Gandhi Tweet, Rahul Gandhi Tweet, Paddy Procurement in Telangana, Telangana Paddy Procurement, Paddy Procurement, Telangana Paddy Procurement Latest News, Telangana Paddy Procurement Latest Updates, Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయం అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మంటలు రేపుతోంది. ఈ విషయంపై అధికార టీఆర్ఎస్ పార్టీకి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నిన్నటివరకు టీఆర్ఎస్ పార్టీకి, కేంద్రంలోని బీజేపీ పార్టీకి మధ్య మాటల తూటాలు పేలుతుంటే.. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా దీనిలోకి ఎంటరైంది. ఈరోజు ధాన్యం కొనుగోలు అంశంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. అయితే, ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరో ట్వీట్‌తో కౌంటర్ ఇచ్చారు. “టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడటం లేదని, సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్ ఇవ్వమని సీఎం  కేసీఆర్ గతేడాది ఆగస్టులో ఒప్పందంపై సంతకం చేశారు. ఆనాడు మీ తండ్రి చేసిన సంతకం నేడు తెలంగాణ రైతుల పాలిట పాశమైంది’’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఈ ఉదయం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంపై టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాయని ట్వీట్ చేయటంతో వివాదం మొదలయింది. రాహుల్ గాంధీ ట్వీట్‌కి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ట్వీట్‌తో రిప్లై ఇవ్వటం విశేషం. మీరు ఒక బాధ్యత కలిగిన ఎంపీగా టీఆర్ఎస్ ఎంపీలతో కలసి పార్లమెంటులో నిరసనకు దిగండి అని కవిత ట్వీట్ చేశారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఉండకూడదని, పంజాబ్, హ‌ర్యానాలో ధాన్యం సేక‌రించినట్లే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ధాన్యం సేక‌రించాల‌ని కోరుతున్నామ‌ని ఆమె ఆ ట్వీట్‌లో తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + nine =