నేటినుంచి తెలంగాణలో టీఎస్ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం.. విద్యార్థులకు కీలక సూచనలు చేసిన అధికారులు

TS EAMCET Exams Starts From Today in Telangana Officials Announces Important Instructions To The Students,TS EAMCET Exams Starts From Today,EAMCET Exams Starts From Today in Telangana,EAMCET Exams In Telangana,Mango News,Mango News Telugu,TS Eamcet Exams,TS EAMCET Exams,TS EAMCET Exam 2023,TS Eamcet 2023 Starts Today,TS EAMCET 2023 Exam Begins Today,TS EAMCET Latest News And Updates,TS EAMCET 2023 Exam Begins Today,EAMCET Exams Latest News And Updates

తెలంగాణలో బుధవారం నుంచి టీఎస్ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. నేటినుంచి 14 వరకు జరిగే పరీక్షల నిర్వహణకు జేఎన్టీయూ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. నేడు, రేపు అగ్రికల్చర్‌ పరీక్ష జరగనుండగా.. 12, 13, 14 తేదీల్లో ఇంజనీరింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్‌లో పరీక్షకు ఉదయం 7.30 గంటల నుంచి, రెండో సెషన్‌లో పరీక్షకు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వనున్నారు.

దీనిలో భాగంగా ఈరోజు అగ్రికల్చర్ విభాగం పరీక్ష జరుగనుంది. ఈ ఎంసెట్ పరీక్ష కోసం తెలంగాణలో 104, ఏపీలో 33 కలిపి మొత్తం 137 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. గ్రేటర్‌ పరిధిలో 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక మొత్తం 3.20 లక్షల మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్ష రాయనుండగా.. ఒక్క హైదరాబాద్‌లోనే 1,71,706 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఒక్కోసెషన్‌కు ఫార్మసీ కోర్సుల్లో 28 వేల మంది విద్యార్థులు హాజరుకానుండగా, ఇంజినీరింగ్‌లో 34వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

ఈ నేపథ్యంలో.. విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు చేసిన పలు కీలక సూచనలు..

  • విద్యార్థులు పరీక్షకు ఒకరోజు ముందే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రం వద్దకు వెళ్లి చూసుకోవాలి.
  • పరీక్ష హాల్లోకి వెళ్లేముందు అభ్యర్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ వేయాల్సి ఉంటుంది.
  • అందుకే అభ్యర్థులు చేతివేళ్లకు గోరింటాకు, మెహిందీ వంటివి పెట్టుకోకూడదు.
  • హాల్‌ టికెట్‌తో పాటు బ్లూ కలర్ లేదా బ్లాక్‌ బాల్‌ పెన్‌ మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారు.
  • ఫోన్లు, టాబ్స్, కాలిక్యులేటర్లు, చేతివాచీలు సహా మరి ఏ విధమైన ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించరు.
  • విద్యార్థులు, ఇన్విజిలేటర్లతో పాటు సిట్టింగ్‌ స్క్వాడ్‌ సభ్యుల వద్ద కూడా సెల్‌ఫోన్‌‌లకు అనుమతి ఉండదు.
  • విద్యార్థి ఫొటో కలిగిన ఏదేని ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరి వెంట తెచ్చుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులో ఉన్నట్లుగానే పరీక్షా హాల్లో ఇన్విజిలేటర్‌ సమక్షంలో హాల్‌ టికెట్‌పై అభ్యర్థి సంతకం చేయాల్సి ఉంటుంది.
  • రఫ్‌వర్క్‌ కోసం పరీక్ష హాల్లో ఇచ్చిన పేపర్లను అభ్యర్థులు అక్కడే వదిలి రావాలి.
  • కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ కాబట్టి ఏవైనా హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ సమస్యలు ఎదురైతే ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకురావాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =