మూడు ఉద్యోగ నోటిఫికేష‌న్ల రాత ప‌రీక్ష‌ల తేదీలు వెల్ల‌డించిన టీఎస్‌పీఎస్సీ

TSPSC Releases Veterinary Assistant Surgeon Horticulture Officer Assistant Motor Vehicle Inspector Posts Written Exams Dates,TSPSC Releases Veterinary Assistant Surgeon Posts,Horticulture Officer Exams Dates, TSPSC Assistant Motor Vehicle Inspector Recruitment 2023,TSPSC 2023 Posts Exams Dates,Mango News,Mango News Telugu,TSPSC Recruitment 2023,Telangana State Public Service Commission,TSPSC Recruitment 2023 Latest Jobs Notification,TSPSC 2023 Posts Latest News And Updates,TSPSC Exams Latest Updates

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటికే గ్రూప్-1, 2, 3, 4 సహా పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్స్ విడుదల చేయగా, దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. దీంతో టీఎస్‌పీఎస్సీ వరుసగా ఆయా నోటిఫికేషన్స్ కు సంబంధించిన పరీక్షల తేదీలను వెల్లడిస్తుంది. ఈ క్రమంలో మరో మూడు ఉద్యోగ నోటిఫికేష‌న్ల రాత ప‌రీక్ష‌ల తేదీలను టీఎస్‌పీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. వెట‌ర్న‌రీ అసిస్టెంట్ స‌ర్జ‌న్, హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్, అసిస్టెంట్ మోటార్ వెహిక‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్ పోస్టుల భ‌ర్తీకి రాత ప‌రీక్ష‌లు తేదీలను టీఎస్‌పీఎస్సీ వెల్లడిస్తూ, ఈ పోస్టుల భర్తీ కోసం కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ పరీక్ష నిర్వహించబడుతుందని తెలియజేసింది.

మూడు ఉద్యోగ నోటిఫికేష‌న్ల రాత ప‌రీక్ష‌ల తేదీలు ఇవే:

  1. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్-ఏ&బీ (వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ శాఖ) – మార్చి 15 (ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో), మార్చి 16న తేదీన ఉదయం సెషన్ లో పరీక్ష నిర్వహణ -185 పోస్టులు – కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ పరీక్ష.
  2. హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ (ఉద్యానవన శాఖ డైరెక్టర్ నియంత్రణ) – ఏప్రిల్ 4న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్ష నిర్వహణ – 22 పోస్టులు – కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ పరీక్ష.
  3. అసిస్టెంట్ మోటార్ వెహిక‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్ (రవాణా శాఖ) – ఏప్రిల్ 23న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్ష నిర్వహణ – 113 పోస్టులు – కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ పరీక్ష.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 3 =