రాజ్యాంగం మీ భుజస్కంధాలపై చాలా బాధ్యత పెట్టింది, ప్రతి ఐపీఎస్ తన బాధ్యతను గుర్తుంచుకోవాలి – కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

Union Home Minister Amit Shah Participates in Passing Out Parade of 74 RR IPS Batch in Hyderabad,Union Home Minister Amit Shah,National Politics News,National Politics And International Politics,National Politics Article,Mango News,Mango News Telugu,National Politics In India,National Politics News Today,National Post Politics,Nationalism In Politics,Post-National Politics,Indian Politics News,Indian Government And Politics,Indian Political System,Indian Politics 2023,Recent Developments In Indian Politics,Shri Narendra Modi Politics,Narendra Modi Political Views,President Of India,Indian Prime Minister Election

హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ)లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్‌) ప్రొబేషనర్ల 74వ బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్‌ శనివారం ఘనంగా జరిగింది. 166 మంది ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీలు, విదేశాల నుంచి 29 మంది ఆఫీసర్ ట్రైనీలు సహా మొత్తం 195 మంది ఆఫీసర్ ట్రైనీలు ఈ దీక్షాత్ పరేడ్‌లో పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన ఐపీఎస్‌లకు అభినందనలు తెలియజేశారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. గడిచిన ఏడు దశాబ్దాల కాలంలో దేశం అంతర్గత భద్రతలో అనేక ఒడిదుడుకులు మరియు సవాళ్లను చూసిందని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో 36,000 మందికి పైగా పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేశారని ఆయన గుర్తుచేశారు. ఐపీఎస్‌లలో అధికం శాతం టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళు ఉన్నారని, భవిష్యత్తులో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని అమిత్ షా తెలిపారు.

2005లో భారత్ ప్రపంచ అర్ధిక వ్యవస్థలో 11 స్థానంలో ఉండేదని, ఇప్పుడు 5 వ స్థానంలో నిలబెట్టామని, ఈ క్రమంలో అతి త్వరలోనే 3వ స్థానానికి వస్తుందని ఆశిస్తున్నామని అమిత్‌ షా పేర్కొన్నారు. శాసనవ్యవస్థ ద్వారా ఒక నాయకుడికి 5 సంవత్సరాలు మాత్రమే అవకాశం ఇస్తారని, కానీ ఐపీఎస్‌లకు 30 సంవత్సరాల పాటు అధికారం ఉంటుందని గుర్తు చేశారు. 8 సంవత్సరాల క్రితం దేశ అంతర్గత భద్రత ఆందోళనకరంగా ఉండేదని, జమ్ము కాశ్మీర్ తీవ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం  జమ్ము కాశ్మీర్‌లో ఆర్టికల్ 371ను తీసుకొచ్చి ఉగ్రవాదాన్ని అదుపులో పెట్టామని, పీఎఫ్‌ఐ లాంటి సంస్థపై రాష్ట్రాల పోలీసులతో కలిసి కేంద్ర దర్యాప్తు సంస్థలు సహకారంతో ఒక్క రోజులోనే చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే ఎన్ఐఏ, ఎన్‌సీబీ లాంటి కేంద్ర ఏజెన్సీల ద్వారా టెర్రరిజం, డ్రగ్స్‌ వంటి సంఘ విద్రోహులపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ద్వారా పోలీస్ వ్యవస్థను పటిష్టం చేశామని వెల్లడించారు. సహా ఎన్నో సమాస్యలు ఉండేవని, అయితే ఆ సమస్యలన్నింటినీ పూర్తిగా కట్టడి చేశామని అమిత్‌ షా తెలిపారు.

కాగా.. ఎన్‌పీఏలో జరిగిన 74వ పాసింగ్ ఔట్ పరేడ్‌లో మొత్తం 195 మంది ట్రైనీ ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. ఈ ఐపీఎస్‌లలో 166 మంది స్వదేశీ మరియు 29 మంది ఫారెనర్స్ ఉండగా.. మరో 37 మంది మహిళా ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. వీరు ఇప్పటికే 46 వారాల కఠోర శిక్షణ మరియు ఫీల్డ్ ట్రైనింగ్‌తో కలిపి దాదాపు 105 వారాల పాటు శిక్షణ పొందారు. ఇక మరోవైపు ప్రతి ఏడాదికి మహిళా ఐపీఎస్‌ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కాగా ఈ బ్యాచ్‌లో ఎక్కువగా ఇంజనేరింగ్, మెడికల్, సిఎ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు తెలంగాణకు ఐదుగురు, ఏపీ కేడర్‌కు ఇద్దరు చొప్పున మొత్తం ఏడుగురు ఐపీఎస్‌లను కేటాయించినట్లు అకాడమీ డైరెక్టర్‌ ఏఎస్‌ రాజన్‌ తెలిపారు. వీరిలో అవినాష్ కుమార్, శేషాద్రి రెడ్డి, మహేష్ బాబా సాహెబ్, శంకేశ్వర్, శివం ఉపాద్యాయలను తెలంగాణకు కేటాయించగా, పంకజ్ కుమార్ మీనా, అంకిత్ మహవీర్‌లను ఏపీకి కేటాయించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 8 =