కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఓట్ల తేడా ఎంతంటే..?

What is the Difference in Votes Between Congress and BRS,What is the Difference in Votes,Votes Between Congress and BRS,Congress and BRS,Congress, BRS, Telangana Assembly Elections,Telangana Politics, Polling,Mango News,Mango News Telugu,Telangana election result recap,Congress leads in Telangana,Telangana polls,Telangana Election Result,Congress and BRS Latest News,Congress and BRS Latest Updates,Congress Live News
congress, brs, telangana assembly elections, telangana politics, polling

కాంగ్రెస్ తిరిగి పవర్‌లోకి వచ్చింది. పదేళ్ల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకుంది. తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతోంది. అటు కాంగ్రెస్ దెబ్బకు కారు పార్టీ బోల్తా పడింది. హ్యాట్రిక్ కొడుతామని ఉవ్విళ్లూరిన కేసీఆర్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. గులాబీ బాస్ వ్యూహాలన్నీ బెడిసికొట్టాయి. హస్తం పార్టీ 64 స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తే.. కారు పార్టీ 39 స్థానాల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ 25 స్థానాలు ఎక్కువగా గెలుచుకుంది. మొత్తం 64 స్థానాలతో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది.

అయితే కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకున్నప్పటికీ.. ఆ పార్టీకి 40 శాతం ఓట్లు కూడా పడలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు పోలయిన ఓట్లలో స్వల్ప తేడా మాత్రమే ఉంది. నవంబర్ 30న జరిగిన పోలింగ్‌లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71.34 శాతం ఓట్లు పోలయ్యాయి. అందులో కాంగ్రెస్‌కు 39.89 శాతం ఓట్లు పడగా.. బీఆర్ఎస్‌కు 38.08 శాతం ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్‌కు కేవలం 1.81 శాతం ఓట్లు మాత్రమే ఎక్కువగా పడ్డాయి. అలాగే 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 47.4 శాతం ఓట్లు పోలవ్వగా.. ఈసారి 9.52 శాతం ఓట్లు తక్కువగా పోలయ్యాయి.

ఇకపోతే అధికార పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్‌కు తాజా ఎన్నికల్లో 91,86,837 ఓట్లు పోలయ్యాయి. అటు బీఆర్ఎస్‌కు 87,14,040 ఓట్లు పడగా.. బీజేపీకి 32,35,583 ఓట్లు.. ఎంఐఎంకు 5,15,809 ఓట్లు.. సీపీఐకి 80,336 ఓట్లు.. బీఎస్పీకి 3,20,079 .. ఇతరులకు 8,98,010.. నోటాకు 1,70,956 ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్‌ కంటే కాంగ్రెస్‌కు 4.72 లక్షల ఓట్లు ఎక్కువగా పడ్డాయి.

ఇకపోతే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 28.43 శాతం ఓట్లు పడ్డాయి. అప్పుడు కాంగ్రెస్ 19 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. 2018 ఎన్నికలతో పోల్చుకుంటే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 11.46 శాతం ఎక్కువగా పోలయ్యాయి. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 19 స్థానాలను మాత్రమే గెలుచుకుంటే.. ఈసారి 45 స్థానాలను ఎక్కువగా గెలుచుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =