కన్నింగ్ చైనా కొత్త కుతంత్రం

China Is Building Fences On The Sea,China Is Building Fences,Building Fences On The Sea,Fences On The Sea,Mango News,Mango News Telugu,China, Philippines,Bajo De Massinloc,Fishermen Of The Philippines,Shanghai Officials Put Up Fences,Mystery Fences Spring Up Blocking,China Latest News,China Latest Updates,China Live News,China Building Fences News Today,Shanghai Officials Latest News

ఏకంగా సముద్రాన్ని మింగేయడానికి చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దక్షిణ చైనా సముద్రంలో..ఇప్పటికే తేలియాడే కంచెను ఏర్పాటు చేయడం అన్ని దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. మరోవైపు దీనిపై తమ దేశపు చేపల వేట పడవలు ఆ వివాదాస్పద స్థలంలోకి వెళ్లకుండా బీజింగ్‌ ఇలా చేసిందని ఫిలిప్పీన్స్‌ ఆరోపిస్తోంది.బాజో డె మాసిన్‌లోక్‌ ఆగ్నేయ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెబుతూ ఫిలిప్పీన్స్‌ కోస్టుగార్డ్‌ ప్రతినిధి ఒకరు ఎక్స్ వేదికగాస్పందించారు.

సాధారణంగా తాము చేపట్టే సముద్ర గస్తీ సమయంలో ..తాజాగా ఫిలిప్పీన్స్‌ కోస్టుగార్డు.. ఈ తేలియాడే కంచెను గుర్తించినట్లు ఆ ప్రతినిధి ట్వీట్ చేశారు. ఈ కంచె పొడవు దాదాపు 900 అడుగుల పైనే ఉన్నట్లు తెలిపారు. చైనా కోస్టుగార్డ్‌ సృష్టించిన ఇలాంటి అడ్డంకులను ఫిలిప్పీన్స్‌ కోస్టుగార్డ్‌‌తో పాటు.. బ్యూరో ఆఫ్‌ ఫిషరీస్‌ అండ్‌ ఆక్వాటిక్‌ రిసోర్స్‌ కూడా గట్టిగా ఖండిస్తోంది. బాజో డె మాసిన్‌లోక్‌ ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న సముద్ర దిబ్బల వైపు.. తమ చేపల వేట పడవలు రాకుండా చైనా ఇలా చేస్తోందని ఫిలిప్పీన్స్‌ కోస్టుగార్డ్‌ ప్రతినిధి ఆరోపిస్తున్నారు. ఇది ఫిలిప్పీన్స్‌ జాలర్ల జీవనోపాధిని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

బాజో డె మాసిన్‌లోక్‌ ఆగ్నేయ ప్రాంతంలో.. ఫిలిప్పిన్స్‌ నౌకలను చైనా బోట్లు పదిహేను సార్లు రేడియోసెట్‌లో హెచ్చరించినట్లు ఫిలిప్పీన్స్‌ కోస్టుగార్డ్‌ ప్రతినిధి చెప్పుకొచ్చారు. చైనా చట్టాలను..ఆ దేశం ఇప్పుడు ఉల్లంఘిస్తున్నట్లు చెప్పారు.అయితే ఫిలిప్పీన్స్‌ నౌకలో కొంతమంది మీడియా సిబ్బంది ఉన్నారన్న విషయం తెలుసుకున్న చైనా నౌకలు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఆయన చెప్పారు.

అటు చైనాకు చెందిన భారీ షిప్పులు తమపై నిఘా వేశాయని ఫిలిప్పీన్స్‌ మత్స్యకారులు చెబుతున్నారు. అంతేకాదు తాము బాజో డె మాసిన్‌లోక్‌ ఆగ్నేయ ప్రాంతానికి వెళ్లిన సమయంలో.. అక్కడ తేలియాడే కంచెను చైనా వేస్తున్నట్లు తెలిపారు. అయితే ఫిలిప్పీన్స్ ఆరోపణలపై మనీలాలోని చైనా దౌత్యకార్యాలయం ఇంకా స్పందించలేదు.

మరోవైపు చైనా మాత్రం ఫిలిప్పీన్స్‌ కోస్టుగార్డ్‌ ప్రతినిధి ప్రకటనను, జాలర్ల ఆరోపణలను ఖండించిది. ఫిలిప్పీన్స్‌ కేవలం రాజకీయ ఆరోపణల కోసం ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వాడుకుంటోందని ఆరోపించింది. ఈ ఆరోపణలు పూర్తిగా ఆధారహితమని చైనా అడ్డంగా బుకాయిస్తోంది. దీనిపై చైనా ప్రతినిధి మావో నింగ్‌ ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు.

నిజానికి సముద్రంలోని ఓ వ్యూహాత్మక దిబ్బ..ఈ బాజో డె మాసిన్‌లోక్‌ . ఈ ప్రాంతంలో చేపలు సమృద్ధిగా ఉంటాయి. ఫిలిప్పీన్స్‌ ద్వీపం లూజోన్‌కు 200 కి.మీటర్ల దూరంలో ఇది ఉంటుంది. ఈ ప్రాంతాన్ని చైనీయులు హువాంగ్‌ యాండావ్‌ అని పిలుస్తుంటారు. దక్షిణ చైనా సముద్రంలో వివాదాస్పద ప్రాంతాల్లో ఇది కూడా ఒకటిగా దీని గురించి చెబుతారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =